మూసీకి పోటెత్తిన వరద
మూసీకి వరద పోటెత్తింది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు వరద ఉధృతి పెరుగుతోంది.
- జంట జలాశయాల గేట్లు ఎత్తివేత
- పరీవాహక ప్రాంత ప్రజలను అలర్ట్ చేసిన అధికారులు
సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): మూసీకి వరద పోటెత్తింది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు వరద ఉధృతి పెరుగుతోంది. అధికారులు జలాశయాల గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ రెండు జలాశయాల్లోకి 1750 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. మూసీ పరీవాహక ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ ప్రకటించారు.
మంగళవారం జలమండలి అధికారులు ఉస్మాన్‌సాగర్ 6 గేట్లను ఎత్తివేశారు. హిమాయత్‌సాగర్ ఒక గేటును ఎత్తారు. ఉస్మాన్‌సాగర్ ఇన్‌ఫ్లో 1400 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1428 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు ఉస్మాన్‌సాగర్ 6 గేట్లను రెండు ఫీట్ల మేర ఎత్తారు. హిమాయత్‌సాగర్ ఒక గేటును ఒక అడుగుమేర ఎత్తి 348 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో జంట జలాశయాల నుంచి 1776 క్యూసెక్కుల వరదనీటిని మూసీనదిలోకి విడుదల చేస్తున్నారు. గేట్ల ఎత్తివేత నేపథ్యంలో మూసీనది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

