సిమ్‌కార్డుల సరఫరాముఠా అరెస్ట్
వివిధ రాష్ర్టాల్లో ఆన్లైన్ ట్రేడింగ్ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలు, చెక్ బుక్‌లు, సిమ్ కార్డ్‌లను సరఫరా చేస్తున్న ఆరుగురిని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఏడు సెల్ఫోన్లు, మూడు చెక్‌బుక్‌లు, 11సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): వివిధ రాష్ర్టాల్లో ఆన్లైన్ ట్రేడింగ్ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలు, చెక్ బుక్‌లు, సిమ్ కార్డ్‌లను సరఫరా చేస్తున్న ఆరుగురిని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఏడు సెల్ఫోన్లు, మూడు చెక్‌బుక్‌లు, 11సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. శనివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబర్‌క్రైమ్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర, సైబర్‌క్రైమ్స్ ఏసీపీ ఎ.రవీంద్రరెడ్డితో కలిసి కేసు వివరాలను వెల్లడించారు.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వెనిగళ్ల శ్రీనివాస్‌రావు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చిత్త గణేశ్ వివిధ మార్గాల ద్వారా బ్యాంకు ఖాతాలు, సిమ్‌కార్డులను సంపాదిస్తారు. అనంతపురం జిల్లాకు చెందిన గండ్లూరు నవీన్‌కుమార్‌రెడ్డి ఖాతాదారులను గుర్తించి వారికి అవసరమైన పత్రాలను సమకూరుస్తాడు. ఈ క్రమంలో సేకరించిన బ్యాంక్ ఖాతాలను మేడ్చల్ జిల్లాకు చెందిన సత్తూరి రాజేశ్‌కు ఒక్కో ఖాతాకు రూ.10వేల కమీషన్‌తోపాటు కోటి రూపాయల లావాదేవీపై లక్ష రూపాయల కమిషన్ చొప్పున బ్యాంక్ ఖాతాలను సరఫరా చేస్తారు.
ఈ విధంగా పొందిన బ్యాంక్ ఖాతాలను రాజేష్ 2శాతం కమీషన్‌పై కృష్ణా జిల్లాకు చెందిన మద్దిరాళ్ల సుధీర్(50), నగరానికి చెందిన మహ్మద్ అష్రఫ్(39)లకు సరఫరా చేస్తాడు. ఈ ఖాతాలను మద్దిరాళ్ల సుధీర్, అష్రఫ్‌లు 5 శాతం కమీషన్‌తో అంతర్జాతీయ సైబర్ మోసగాళ్లకు టెలిగ్రామ్ ద్వారా సరఫరా చేస్తారు. ఈ క్రమంలో నిందితులు 1.09 కోట్ల మొత్తాన్ని బాధితుల ఖాతాల నుంచి దోచుకున్నారు. ఈ మేరకు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించి, నిందితులను అరెస్టు చేశారు. ఈ సమావేశంలో సైబర్‌క్రైమ్ ఇన్స్పెక్టర్లు జి.విజయ్‌కుమార్, వీడీఆర్ఎల్.దుర్గా, డి.పల్లవి, ఎస్ఐలు సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

