Cardiac Arrest | కాలేజీ కారిడార్‌లో గుండెపోటుతో కుప్పకూలిన ఇంజినీరింగ్ విద్యార్థి
Cardiac Arrest | తాజాగా మరో యువకుడు కాలేజీ కారిడార్‌లో నడుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలోని కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో శుక్రవారం చోటు చేసుకుంది.
Cardiac Arrest | మేడ్చల్ : ఆ మొన్న జిమ్‌లో వర్కవుట్ చేస్తూ కానిస్టేబుల్, మొన్న డ్యాన్స్ చేస్తూ మరో యువకుడు, నిన్న బ్యాడ్మింటన్ ఆడుతూ మరో ప్లేయర్ గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. తాజాగా మరో యువకుడు కాలేజీ కారిడార్‌లో నడుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలోని కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో శుక్రవారం చోటు చేసుకుంది.
రాజస్థాన్‌కు చెందిన సచిన్(18) అనే విద్యార్థి తన తల్లిదండ్రులతో కలిసి కుత్బుల్లాపూర్ మండలం సుచిత్ర ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం కళాశాలకు వెళ్లిన సచిన్ మధ్యాహ్నం 3 గంటల సమయంలో కారిడార్‌లో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో గుండెపొటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థుల సమాచారంతో యాజమాన్యం అతడిని హుటాహుటినా పక్కనే ఉన్న సీఎంఆర్ హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్లో వైద్యులు సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

