Hyderabad | మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లాపూర్‌లోని సుమంత్ ఇంటి ముందు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఓ వ్యాపారిని రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి, ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేశాడని సుమంత్‌పై ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఈ కేసులో సుమంత్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు మంత్రి సురేఖ, సీఎం రేవంత్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారిపోయాయి. సీఎం రేవంత్ అవినీతి అక్రమాలను బైటపెడుతానని సురేఖ కూతురు సుష్మిత ఆరోపణలు చేయడంతో కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని కొంతమంది ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంత్రి మాజీ ఎస్డీ డ్రైవర్‌ను అరెస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్
తెల్లాపూర్‌లోని సుమంత్ ఇంటి ముందు అరెస్ట్ చేసిన పోలీసులు
ఓ వ్యాపారిని రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి, ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేశాడని సుమంత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
ఈ కేసులో సుమంత్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు https://t.co/UIuTI4eaeq pic.twitter.com/zQxndu59pD
— Telugu Scribe (@TeluguScribe) August 23, 2026