అర్హత లేకున్నా..
అర్హత లేకుండా చికిత్స చేయడంతో పాటు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి లేకుండానే ఔషధాలు విక్రయిస్తున్న ఆర్ఎంపీ క్లినిక్‌పై డీసీఏ అధికారులు దాడులు జరిపారు. అనుమతి లేకుండా విక్రయిస్తున్న 17 రకాల ఔషధాలను సీజ్ చేయడంతో పాటు అర్హత లేకుండా మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్న మహిళకు నోటీసులు జారీ చేశారు.
- చికిత్స.. ఔషధాల విక్రయం
- ఆర్ఎంపీ క్లినిక్‌పై డీసీఏ దాడి.. 17 రకాల ఔషధాలు సీజ్
సిటీబ్యూరో: అర్హత లేకుండా చికిత్స చేయడంతో పాటు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి లేకుండానే ఔషధాలు విక్రయిస్తున్న ఆర్ఎంపీ క్లినిక్‌పై డీసీఏ అధికారులు దాడులు జరిపారు. అనుమతి లేకుండా విక్రయిస్తున్న 17 రకాల ఔషధాలను సీజ్ చేయడంతో పాటు అర్హత లేకుండా మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్న మహిళకు నోటీసులు జారీ చేశారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం…గచ్చిబౌలిలోని సిద్ధిక్‌నగర్‌లో స్థానికంగా నివాసముండే స్వరూప అదే ప్రాంతంలో ‘స్వరూప ఫస్ట్ ఎయిడ్ సెంటర్’ పేరుతో క్లినిక్‌ను నిర్వహిస్తూ అర్హత లేకున్నా రోగులకు చికిత్స చేస్తున్నారు. అంతే కాకుండా డీసీఏ అనుమతి లేకుండానే ఔషధాలు సైతం అమ్ముతున్నారు. సమాచారం అందుకున్న డీసీఏ అధికారులు బుధవారం క్లినిక్‌పై దాడులు జరిపి.. పలు ఔషధాలను సీజ్ చేశారు. అర్హత లేకున్నా మెడికల్ ప్రాక్టీస్ చేస్తూ, ఔషధాలు విక్రయిస్తున్న స్వరూపకు నోటీసులు జారీ చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు
నిబంధనలకు విరుద్ధంగా ఔషధాలపై ప్రకటనలు ముద్రిస్తున్న పలు ఔషధ తయారీ కంపెనీలకు డీసీఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. కాప్రా, ఖమ్మం పరిధిలో ‘పీ-మైసటిన్’ అయింట్మెంట్పై కంటి జబ్బుల నివారణకు అంటూ నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు ముద్రించారు. సమాచారం అందుకున్న డీసీఏ అధికారులు.. కాప్రా పరిధిలోని పలు మెడికల్ షాపులపై దాడులు జరిపి నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు ముద్రించిన పీ-మైసటిన్ మందులను సీజ్ చేశారు. అయింట్మెంట్ తయారీ కంపెనీ ఈస్టర్న్ హెల్త్‌కేర్‌కు నోటీసులు జారీ చేశారు. మరో కేసులో ఖమ్మం జిల్లాలో ‘మహా సుదర్శన కాఢ’పై జ్వరం నివారణ పేరుతో ప్రకటనలు ముద్రించారు. డీసీఏ అధికారులు కాప్రా, ఖమ్మం జిల్లాలోని పలు మెడికల్ షాపులపై దాడులు జరిపి, ప్రకటనలు ముద్రించి ఉన్న ఔషధాలను సీజ్ చేసి, వాటి తయారీ కంపెనీలకు నోటీసులు జారీ చేశారు.
నిర్ణీత ధరల కంటే అధిక రేట్లకు..
అధిక రేట్లకు విక్రయిస్తున్న ఔషధాలను డీసీఏ అధికారులు సీజ్ చేసి.. తయారీ కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. ‘ఇట్రాకాంజోల్ క్యాప్సుల్స్-200 ఎంజీ’ పది మాత్రల ధర అన్ని రకాల పన్నులతో కలిపి రూ. 247.7కు విక్రయించాలి. కానీ ‘సఫిక్స్’ అనే ఔషధ తయారీ కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా 10 మాత్రలను రూ. 298కి విక్రయిస్తోంది. అంటే ప్రతి 10 మాత్రలపై రూ. 50.30 అధికంగా వసూలు చేస్తోంది. సమాచారం అందుకున్న డీఏసీ అధికారులు శామీర్‌పేటలోని పలు మెడికల్ షాపులపై దాడులు జరిపి.. అధిక ధరలకు విక్రయిస్తున్న ఔషధాలను సీజ్ చేసి, తయారీ కంపెనీ ‘సఫిక్స్’కు నోటీసులు జారీ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఓటరు నమోదులో వేగం పెంచాలి… రేవంత్ రెడ్డిని గద్దె దించాలి’
‘పిల్లలపై లైంగిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
Harish Rao | చంద్రబాబు నాయుడు ఏపీకి కరువు లేకుండా చేశారు.. తెలంగాణకు కరువు తెచ్చిందే కాంగ్రెస్ : హరీశ్ రావు
‘భూసార పరిరక్షణతోనే అధిక దిగుబడులు’
‘ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

