ధైర్యమిచ్చారు..కోలుకున్నారు..

- రాచకొండ కమిషనరేట్ సిబ్బందికి సీపీ భరోసా
- ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు..ఎప్పటికప్పుడు ఆరా
- ఆర్థిక సహాయం, మెడికల్ కిట్, డ్రై ఫ్రూట్స్ అందజేత
- త్వరగా కోలుకొని విధుల్లో చేరిక
సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో విధి నిర్వహణలో అధికారులు, సిబ్బంది అనేకమంది కరోనా బారినపడ్డారు. అయినా స్వల్పకాలంలో ముందస్తు ప్రణాళికతో వారు త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకున్నారు పోలీసు కమిషనర్ మహేష్ భగవత్. కొవిడ్ బారినపడిన దాదాపు 1000 మందికి పైగా సిబ్బంది అతికొద్ది కాలంలోనే ఆరోగ్యవంతులై తిరిగి విధుల్లో చేరారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మొదటి, రెండోదశల్లో దాదాపు 1000 మందికి పైగా అధికారులు, సిబ్బందికి మహమ్మారి సోకింది. వారికి సకాలంలో సీపీ మహేష్ భగవత్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు ఇచ్చిన సలహాలు, సూచనలతో కరోనాను జయించారు. ఈ రెండు దశల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా మరణం జరగకుండా సఫలమయ్యారు. ఆర్థిక సహాయంతోపాటు పౌష్టికాహారం, సలహాలు, సూచనలతో నిరంతరం సిబ్బంది, అధికారుల్లో ధైర్యం నింపారు.
రాచకొండ కొవిడ్ పాజిటివ్ గ్రూపు
సిబ్బంది కరోనా బారిన పడుతున్న విషయాన్ని గమనించి వెంటనే రాచకొండ కొవిడ్ పాజిటివ్ వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశారు. కొవిడ్ సోకిందని తెలియగానే ఖర్చుల కోసం 5 వేల రూపాయలను ఖాతాలో జమ చేస్తారు. ఆ తర్వాత ఉద్యోగి వివరాలు, పోస్టింగ్, ఇంటి చిరునామా తెలుసుకొని డ్రైప్రూట్స్తోపాటు మెడికిల్ కిట్ పంపిస్తారు. ప్రతిరోజు వాట్సాప్ గ్రూపు ద్వారా ఐసొలేషన్ దినచర్యలను వివరిస్తారు. ఇంట్లో వసతి లేనివారికి కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రంలో బస ఏర్పాటు చేశారు. వైద్యుల సలహాలు అందించడంతోపాటు శ్వాసను పెంచుకునేందుకు చేయాల్సిన వ్యాయామాల గురించి తెలిపారు. వారం రోజులకోసారి జూమ్ యాప్ ద్వారా సీపీ కొవిడ్ బారినపడిన వారితో నేరుగా మాట్లాడి వారిలో మనోధైర్యం నింపారు.
మాలో భయాన్ని తొలగించారు
కొవిడ్ వచ్చిందని తెలియగానే భయపడ్డా. రాచకొండ కొవిడ్ పాజిటివ్ గ్రూపు ద్వారా మాకందిన సహకారం, సలహాలు, సూచనలతోపాటు సీపీ సార్ నేరుగా మాట్లాడడం మాలో ధైర్యాన్ని నింపింది. ఆరోగ్యంగా బయటపడ్డాం. తిరిగి ఉల్లాసంగా విధుల్లో చేరాం. -జోసెఫ్, ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, రాచకొండ
రెండుసార్లు వచ్చినా..
కరోనా అనగానే రెండురోజులు భయపడ్డాను. పోలీసు కమిషనర్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు ఎప్పటికప్పడు మాట్లాడి భయాందోళనకు గురికాకుండా భరోసా నింపారు. సీపీ సార్ స్ఫూర్తితో రెండుసార్లు కొవిడ్ వచ్చినా తట్టుకొని నిలబడి ఇప్పుడు ఆరోగ్యంగా ఉద్యోగం చేస్తున్నా.-ఆశ, కానిస్టేబుల్, మల్కాజిగిరి పీఎస్
కొండంత ధైర్యాన్నిచ్చింది
పోలీసు కమిషనర్ మహేష్‌భగవత్ సార్ కరోనా సోకిందని తెలియగానే నేరుగా మాట్లాడారు. ఈ ఒక్క ఫోన్ కాల్ మాకు మొండి ధైర్యాన్ని కల్పించింది. తెలిసిన 24 గంటల్లో మెడికల్ కిట్, డ్రై ఫ్రూట్స్, రూ.5 వేలు ఇచ్చారు. -అనిల్, రిజర్వు కానిస్టేబుల్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

