ఉదయం 9లోపే సిటీ క్లీన్
వందకు వంద శాతం ఇంటింటికీ చెత్త సేకరణే లక్ష్యంగా జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ ప్రత్యేక కార్యాచరణ అమలుకు శ్రీకారం చుట్టారు.
- చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
- వందకు వంద శాతం ఇంటింటి చెత్త సేకరణ
- మెరుగైన పారిశుధ్య నిర్వహణకు వంద రోజుల ప్రణాళిక
- మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా నిరంతర పర్యవేక్షణ
- తరచూ చెత్త వేసే 2640 ప్రాంతాలపై నజర్
సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ మహానగరాన్ని చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ వంద రోజుల ప్రణాళికను సిద్ధం చేసింది. నగరంలో మెరుగైన పారిశుధ్య నిర్వహణకు వందకు వంద శాతం ఇంటింటికీ చెత్త సేకరణే లక్ష్యంగా జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ప్రత్యేక కార్యాచరణ అమలుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్రతి రోజూ ఉదయం 9 గంటలలోపే ఇంటింటి చెత్త సేకరణ పూర్తవ్వడంతో పాటు రోడ్లపై వేసిన చెత్త కుప్పలను క్లియర్ చేస్తున్నారు. ప్రధానంగా పారిశుధ్య నిర్వహణలో ‘మై జీహెచ్ఎంసీ’ యాప్ ద్వారా చెత్తకుప్పల తొలిగింపు పూర్తయిందా? లేదా? అనే ‘ క్లీనింగ్ స్టేటస్’ వివరాలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అలాగే గ్రేటర్ వ్యాప్తంగా 2,640 చోట్ల చెత్త కుప్పలున్నట్లు ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా) ఇచ్చిన నివేదిక ఆధారంగా బహిరంగ ప్రదేశాల్లో చెత్త లేకుండా చేయాలని, తరచూగా చెత్త వేసే వారిని గుర్తించాలని నిర్ణయించారు.
వందకు వంద శాతం ఇంటింటికీ చెత్త సేకరణే లక్ష్యంగా జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ ప్రత్యేక కార్యాచరణ అమలుకు శ్రీకారం చుట్టారు. చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా తరచూ చెత్త వేసే ప్రాంతాల (గార్బేజీ వనరేబుల్ పాయింట్లు/జీవీపీ)పై దృష్టి సారించారు. జీహెచ్ఎంసీలో డస్ట్ బిన్లు ఎత్తివేసి..స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటికీ చెత్త సేకరణ ప్రక్రియ జరుపుతుండగా..అక్కడకక్కడా కొందరు బహిరంగంగానే చెత్త వేస్తూ వస్తున్నారు.
ఇలా గ్రేటర్ వ్యాప్తంగా 2640 చోట్ల చెత్త కుప్పలున్నట్లు ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా) నివేదిక ఇచ్చింది. దీంతో కమిషనర్ బహిరంగ ప్రదేశాల్లో చెత్త లేకుండా చేయాలని, తరచూ చెత్త వేసే వారిని గుర్తించాలని నిర్ణయించారు. ఈ మేరకు పారిశుధ్య సూపర్ వైజర్లకు (ఎస్ఎఫ్ఏ) పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఒక్కో చోట ఆయా ఎస్ఎఫ్ఏను బాధ్యత వహించనున్నారు. తరచూగా చెత్త వేసే వారి పట్ల జీహెచ్ఎంసీ జరిమానాలు సైతం విధించనున్నారు. బహిరంగ చెత్త పాయింట్ల తొలగింపు, స్వచ్ఛ ఆటోల పనితీరును మరింత మెరుగు పరుచుకోవడం, ప్రజల్లో స్వచ్ఛ పరిసరాలపై అవగాహన పెంచడం, రాత్రి పూట కొనసాగే హోటళ్లు, ఇతర తిను బండారాల దుకాణదారుల్లో చెత్త నిర్వహణపై విస్తృత ప్రచారం చేపట్టాలని నిర్ణయించారు.
వంద రోజుల ప్రణాళిక అమలు
గ్రేటర్ పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగు పర్చుతూ బల్దియా వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నది. ప్రతి రోజూ ఉదయం 9 గంటల లోపే ఇంటింటి చెత్త సేకరణ పూర్తవ్వడంతో పాటు రోడ్లపై వేసిన చెత్త కుప్పలను తొలగిస్తున్నారు. ప్రధానంగా పారిశుధ్య నిర్వహణలో ‘ మై జీహెచ్ఎంసీ’ యాప్ ద్వారా కమిషనర్ , జోనల్ కమిషనర్లు, డిప్యూటీ జోనల్ కమిషనర్లు, సహాయ వైద్యాధికారులు, శానిటరీ ఇంజినీర్లు పారిశుధ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. యాప్ విధానం అమలులో భాగంగా చెత్తకుప్పల తొలగింపు పూర్తయిందా? లేదా అనే ‘ క్లీనింగ్ స్టేటస్’ వివరాలను సంబంధిత ఎస్ఎఫ్ఏ, స్వచ్ఛ సాతీలు ఉదయం 8-30 గంటల నుంచి 9 గంటల సమయంలో సంబంధిత మొబైల్ యాప్‌లో పొందుపర్చుతున్నారు. ఈ సమయంలో ఆయా ప్రాంతాల్లో చెత్త కుప్పలు కనిపించినైట్లెయితే ఆయా అధికారులను బాధ్యులను చేస్తూ చర్యలు ఉంటాయన్న కమిషనర్ ఆదేశాల మేరకు పారిశుధ్య నిర్వహణలో గడిచిన నెల రోజులుగా ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెబుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

