ప్రకటనల పాలసీ ఫ్లాప్
నగరంలో ఎకడ ప్రకటనలు ఉండాలి? వేటికి అనుమతులు ఇవ్వాలి? అనే అంశాలను ఈ కమిటీయే తేలుస్తుంది.
- బడా ఏజెన్సీలతో కుమ్మక్కు..ప్రజాధనం లూటీ
- పాలసీ అమలుకు కాంగ్రెస్ పెద్దల మోకాలడ్డు
- చక్రం తిప్పుతున్న ముఖ్యనేత అనుచరులు, యువ ఎమ్మెల్సీ
- యథేచ్ఛగా అనుమతి లేని ప్రకటనల బోర్డులు
- శంషాబాద్ ఎయిర్‌పోర్టు కేంద్రంగా రెచ్చిపోతున్న ఏజెన్సీలు
- జీవో పట్టించుకోని ఏఆర్సీ కమిటీ
క్యూర్ పరిధిలో ప్రకటన పాలసీ అమలుకు నోచుకోవడం లేదు.ప్రభుత్వంలోని కొందరు పెద్దలు బడా యాడ్స్ ఏజెన్సీలతో కుమ్మక్కవుతూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. ప్రకటనల ఫీజుల రూపంలో కార్పొరేషన్‌కు రావాల్సిన ఆదాయాన్ని దారి మళ్లిస్తూ ఏటా రూ. కోట్లు గటిస్తున్నారు. వాస్తవంగా అనధికారిక ప్రకటనలు విచ్చలవిడిగా పెరిగిపోవడంతో పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో రెండు నెలల క్రితం వీటి నియంత్రణలో భాగంగా కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో ప్రకటనల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ‘అడ్వరె్టైజ్ మెంట్ రెగ్యులేటరీ కమిటీ (ఏఆర్సీ)ని నోడల్ అథారిటీగా నియమించింది. పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీలో మెట్రోపాలిటన్ కమిషనర్ (హెచ్ఎండీఏ), జీహెచ్ఎంసీ కమిషనర్‌తో పాటు ఎంఎంసీ, సీఎంసీ కమిషనర్, ట్రాఫిక్ పోలీసులు, మెట్రో రైలు, పర్యాటక, ఆర్టీసీ ప్రతినిధులు సభ్యులుగా నియమించారు. ఏ ప్రాంతంలో ఎలాంటి ప్రకటనలు ఉండాలో ఈ కమిటీయే డిజైన్ చేస్తుంది.
సిటీబ్యూరో, అక్టోబరు 27 (నమస్తే తెలంగాణ ):నగరంలో ఎకడ ప్రకటనలు ఉండాలి? వేటికి అనుమతులు ఇవ్వాలి? అనే అంశాలను ఈ కమిటీయే తేలుస్తుంది. ఈ అధికారిక ఉత్తర్వులు కాగితాలకే పరిమితం కావడం..క్షేత్రస్థాయిలో వందల సంఖ్యలో అక్రమ హోర్డింగ్‌లు, లాలీపాప్స్ బోర్డులు, భారీ కాంటిలివర్లు అనధికారికంగా ఉండడం…రోజుకో కొత్త ఏరియాలో అక్రమ ప్రకటనల బోర్డులు వెలుస్తుండడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నది. ముఖ్యంగా ముఖ్యనేత అనుచరులు, ఓ యువ ఎమ్మెల్సీ ఈ ప్రకటనల బోర్డుల వెనుక అన్నీ తానై నడిపిస్తున్నట్లు ప్రచారం ఉంది.
ఏళ్ల తరబడి ఒకే స్థానంలో ఉంటున్న ఓ అధికారిణి సైతం చక్రం తిప్పుతూ అందినంత దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జీహెచ్ఎంసీ ప్రకటన విభాగంలో అధికారుల నిర్లక్ష్యం, అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థమవుతుంది. విలీన మున్పిపాలిటీల్లో ఎన్ని ప్రకటనల బోర్డులు అనధికారికంగా ఉన్నాయో? ఎన్ని అనుమతులున్నాయో, వాటికి ఎంత గడువుందో తెలియదు. అక్రమంగా ఏర్పాటైన ప్రకటనల బోర్డుల ద్వారా జీహెచ్ఎంసీ ఖజానాకు జరుగుతున్న నష్టానికి లెక్కేలేదు, యూనిపోల్స్, లాలీపాప్స్, హోర్డింగు ఇలా అనేక ఉన్న ప్రాంతాలు అధికారుల రికార్డులు లెక్కలకు , క్షేత్రస్థాయిలో ఉన్న వాటికి ఎక్కడ పొంతన ఉండడం లేదన్నది ఇటీవల వస్తున్న బలమైన అరోపణలు ఉన్నాయి.
ముఖ్యంగా వట్టి నాగులపల్లి ముప్పా రోడ్డు, గోపన్‌పల్లి తండా ప్రాంతాల్లో గడిచిన కొన్ని రోజులుగా అక్రమ ప్రకటన నిర్మాణం యథేచ్ఛగా సాగుతోంది. జీహెచ్ఎంసీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో, ఎటువంటి పర్మిషన్లు లేకుండానే వందలాది లాలీపాప్‌లు, భారీ కాంటిలివర్లు వెలుస్తున్నాయి. వట్టి నాగులపల్లి నుంచి ముప్పా రోడ్డు వరకు, గోపన్‌పల్లి ఫె్లైఓవర్ సమీపంలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే 10 నుంచి 15 వరకు ఫౌండేషన్లు, నాలుగు చోట్ల ప్యానెల్ నిర్మాణాలు, సుమారు 400 నుంచి 500 వరకు కొత్త లాలీపాప్‌లు, 20 నుంచి 30 వరకు కాంటిలివర్లు అనధికారికంగా ఉండడం గమనార్హం. ఆర్అండ్బీ శాఖతో ఎంఓయూ ఉందంటూ పేర్కొంటూ జీహెచ్ఎంసీ పర్మిషన్ లేకుండానే రూ.వందల కోట్ల వ్యాపారం చేస్తుండడం, కట్టడి చేయడంలో అధికార యంత్రాంగం విఫలం చెందడం పై తీవ్ర విమర్శలు
వెలువెత్తుతున్నాయి.
ఎయిర్‌పోర్టు కేంద్రంగా నయా దందా..
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ రహదారి అక్రమ ప్రకటనల దందాకు అడ్డాగా మారింది. నిబంధనలను తుంగలో తొకి , ప్రభుత్వ అనుమతులు లేకుండానే ప్రకటనల బోర్డులను ఏర్పాటు చేస్తూ ఒక ప్రైవేటు ఏజెన్సీ కోట్ల రూపాయలు కొల్లగొడుతోంది. విమానాశ్రయానికి వెళ్లే ప్రధాన రహదారిలోని సెంట్రల్ మీడియన్ లో సదరు యాడ్ ఏజెన్సీ యథేచ్ఛగా లాలీపాప్ ప్రకటనల బోర్డులను ఏర్పాటు చేశారు. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా, ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులను ఎగవేస్తూ అక్రమంగా వ్యాపారం సాగిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన విమానాశ్రయ మార్గంలో నిత్యం వేలాది వాహనాలు, వీఐపీలు రాకపోకలు సాగిస్తుంటాయి. అధికారుల ముందే ఈ అక్రమ బోర్డులు దర్శనమిస్తున్నా కంటితుడుపు చర్యలు కూడా తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం ప్రకటనల ఏర్పాటుకు కార్పొరేషన్‌లోని అడ్వరె్టైజింగ్ విభాగం నుంచి అనుమతులు పొందడంతో పాటు భారీగా పన్నులు చెల్లించాలి. కానీ ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండానే రహదారి పొడవునా బోర్డులు వెలియడం, వాటి ద్వారా ప్రకటనకర్తల నుంచి భారీగా వసూలు చేయడం వెనుక అధికారుల పాత్ర ఉందా అనే విమర్శలు వస్తున్నాయి.
ఏఆర్‌సీపై తీవ్ర విమర్శలు
అక్రమ ప్రకటనలు, హోర్డింగులను నియంత్రించేందుకు ప్రత్యేకంగా ఉన్న ‘అడ్వరె్టైజ్ మెంట్ రెగ్యులేటరీ కమిటీ (ఏఆర్సీ)’ పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన కమిటీ, విలీన మున్సిపాలిటీల్లోని అక్రమ ఏజెన్సీలపై అక్రమాలను చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము పకదారి పడుతున్నా ఏఆర్సీ మౌనం వహించడం వెనుక ఏజెన్సీ నిర్వాహకులతో ఉన్న సంబంధాలే కారణమని పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి శంషాబాద్ ఎయిర్ పోర్టు రోడ్డులోని అక్రమ లాలీపాప్ బోర్డులను తొలగించాలని, నిబంధనలు ఉల్లంఘించిన సదరు యాడ్స్ ఏజెన్సీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన అధికారులపై విచారణ జరిపించాలని ప్రజలు, పన్ను చెల్లింపుదారులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

