మట్టి వినాయకులనే పూజిద్దాం
వినాయక చవితిని పురస్కరించుకుని నగరవాసులందరూ మట్టి విగ్రహాలనే పూజించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సూచించారు. ఈమేరకు ఆమె మంగళవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.
- సిటీలో విక్రయ కేంద్రాల ఏర్పాటు
- కలెక్టర్ హరిచందన దాసరి
సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): వినాయక చవితిని పురస్కరించుకుని నగరవాసులందరూ మట్టి విగ్రహాలనే పూజించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సూచించారు. ఈమేరకు ఆమె మంగళవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన విగ్రహాలను నదులు, చెరువుల్లో నిమజ్జనం చేయడం వలన నీటి కాలుష్యం ఏర్పడి వాతావరణ సమతుల్యత దెబ్బతింటుందని అన్నారు.
జిల్లాలోని కుమ్మరి వృత్తి సొసైటీ సభ్యులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అనుభవం కలిగిన వారికి శిక్షణ ఇచ్చి మట్టి విగ్రహాలను తయారు చేయిస్తున్నామని తెలిపారు. మట్టి విగ్రహాలను గుడి మాల్కాపూర్ పూల మార్కెట్, మెహదీపట్నం రైతు బజార్, అమీర్‌పేట అమ్మవారి గుడి దగ్గర, అన్ని ప్రధాన కూడళ్లు, మార్కెట్ యార్డుల్లో ఉంచి అతి తక్కువ రేట్లకు విక్రయించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రజలంతా మట్టి విగ్రహాలను కొనుగోలు చేసి కుమ్మరి వృత్తిని ప్రోత్సహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తమవంతు సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. అధిక మొత్తంలో విగ్రహాలను ఆర్డర్ చేయాలనుకునేవారు 94900 27838, 96667 04555, 99121 54519, 93473 17210, 99637 16118 నంబర్లను సంప్రదించాలని సూచించారు. మట్టి ప్రతిమలు ఒక అడుగు నుంచి నాలుగు అడుగుల వరకు తక్కువ ధరల్లో లభ్యమవుతామని కలెక్టర్ పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

