సెల్‌ఫోన్ డ్రైవింగ్.. వద్దు గురూ..!

- నిబంధనలు మనకోసమే అయినా.. గాలికొదిలేస్తున్న వైనం
- ఆడియో, వీడియో కాల్ మాట్లాడుతూ డ్రైవింగ్
- తనతో పాటు.. పక్కవారికి ప్రమాదమే
- రోజురోజుకూ పెరిగిపోతున్న కేసులు
- చలాన్ విధించినా.. మారని వాహనదారులు
- ఇప్పటికైనా మారుదాం.. ప్రాణాలు నిలుపుకుందాం..!
సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ): “వేగం కన్నా ప్రాణం మిన్నా..” “సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం ప్రమాదకరం.. చట్టరీత్యా నేరం” అని ప్రతి వాహనం వెనుక రాసి ఉండటం చూస్తూనే ఉంటాం. దీన్ని ప్రతి వాహన దారుడు నిత్యం చదువుతూనే ఉన్నప్పటికీ.. ఏ ఒక్కరూ పాటించడం లేదు. రయ్యుమని దూసుకు పోతూనే.. ఫోన్లో లీనమై పోతున్నారు. ముందూ.. వెనుక.. గమనించకుండా.. ఇష్టారాజ్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఆటోలు, కార్లు, లారీలు, తదితర డ్రైవర్లు సైతం వీడియో కాల్స్‌లో లీనమై ప్రమాదాల బారిన పడుతున్నారు. వీరితో పాటు ఇతరులను సైతం ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఇలాంటి వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ.. చలాన్ విధిస్తున్నప్పటికీ మార్పు రావడం లేదు. దీంతో అతివేగం, నిర్లక్ష్యం డ్రైవింగ్ తరువాత సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది.
పెరిగిపోతున్న చలానాలు
సెల్‌ఫోన్ డ్రైవింగ్ అనేది చాలా ప్రమాదకరమైంది. దీనిపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ మార్పు రావడం లేదు. దీంతో ఎక్కువగా సెల్‌ఫోన్ డ్రైవింగ్ చలానాలు నమోదవుతున్నాయి. అయితే పోలీసులు చలాన్ విధిస్తారని సెల్ ఫోన్ డ్రైవింగ్ మానేయడం కాదు.. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే.. ప్రమాదాల బారిన పడుతాం.. తన కోసం ఇంట్లోవారు ఎదురుచూస్తుంటారనే విషయాన్ని గుర్తుచేసుకొని సెల్‌ఫోన్ డ్రైవింగ్‌ను తనకుతానుగా నిషేధించుకోవాలి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

