బీఆర్ఎస్ పోరాటం.. డ్రైనేజీ పనులు షురూ
బీఆర్ఎస్ పోరాటంతోనే శంషాబాద్ ఆర్టీసీ బస్‌స్టాండ్ నుంచి రాళ్లగూడ రోడ్డులో డ్రైనేజీ పనులు ప్రారంభమైనట్లు బీఆర్ఎస్ కొత్వాల్‌గూడ డివిజన్ అధ్యక్షుడు కొన్నమొల్ల శ్రీనివాస్ తెలిపారు.
శంషాబాద్ రూరల్: బీఆర్ఎస్ పోరాటంతోనే శంషాబాద్ ఆర్టీసీ బస్‌స్టాండ్ నుంచి రాళ్లగూడ రోడ్డులో డ్రైనేజీ పనులు ప్రారంభమైనట్లు బీఆర్ఎస్ కొత్వాల్‌గూడ డివిజన్ అధ్యక్షుడు కొన్నమొల్ల శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం శంషాబాద్ నుంచి రాళ్లగూడ రోడ్డులో ప్రారంభమైన పనులను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. గత ఏప్రిల్ నెలలో రోడ్డు విస్తరణలో భాగంగా ఫుట్‌పాత్‌లను తొలగించిన అధికారులు..రోడ్డు పనులు ప్రారంభించారు.
అసంపూర్తి పనులతో రోడ్డుపై మురుగునీరు ఏరులైపారుతున్నది. దీంతో బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని అనేకసార్లు ధర్నాలు చేయడంతో పాటు ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ అధికారులకు ఫిర్యాదులు చేశారు. డ్రైనేజీ పనులు పూర్తి చేయకపోతే రోడ్డును పూర్తిగా స్తంభింప జేస్తామని హెచ్చరించారు. స్పందించిన అధికారులు ఎట్టకేలకు డ్రైనేజీ పనులను ప్రారంభించినట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఆ పనులను పరిశీలించినట్లు చెప్పారు. పనులు పరిశీలించిన వారిలో కోఆర్డినేటర్ బుచ్చిరెడ్డి, రాజేందర్, మల్లేశ్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

