బిగ్బాస్ 5 కంటెస్టెంట్, యూట్యూబ్ స్టార్ సరయును బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై ఇప్పటికే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. హిందువుల విశ్వాసాలను దెబ్బతీసేలా సరయు ఓ వీడియోలో నటించిందంటూ తనపై కొందరు కేసు పెట్టారు. ఆ కేసు ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు సరయును తాజాగా అదుపులోకి తీసుకొని విచారిస్తుస్తున్నారు.