Minister Ponnam Prabhakar | హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెంచాలి.. డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలి: మంత్రి పొన్నం
నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పలు నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు, బడ్జెట్లో నగరానికి కావాల్సిన అవసరాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సోమవారం హైదరాబాద్ జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం జరిగింది.
Minister Ponnam Prabhakar | సిటీబ్యూరో: నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పలు నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు, బడ్జెట్లో నగరానికి కావాల్సిన అవసరాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సోమవారం హైదరాబాద్ జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు శ్రీ గణేశ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మహ్మద్ ముబిన్, కౌసర్ మోహినుద్దీన్, బలాల, మాజీద్ హుస్సేన్, జాఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, ప్రభాకర్ రావు, మీర్జా రియాజ్ ఉల్ హుస్సేన్ తదితరులు హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాల్లోపు నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమారని కలిసి నగర అభివృద్ధికి కావాల్సిన అవసరాలు, పెండింగ్ బిల్లులు, ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ పనుల పురోగతి తదితర అంశాలపై విజ్ఞప్తి చేయాలని సమావేశంలో చర్చించారు. నగరంలో సూళ్లలో ఉన్న పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. హైదరాబాద్ అభివృద్ధిపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెంచేలా చర్యలు చేపట్టాలని మంత్రి అన్నారు. సమావేశంలో పోలీస్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
4 ఎస్టీపీలు..రూ. 65.05 కోట్లతో టెండర్లు
సిటీబ్యూరో: ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లకు మురుగునీటి నుంచి శాశ్వత విముక్తి కల్పించేందుకు జలమండలి చర్యలు చేపట్టింది. 4 చోట్ల ఎస్టీపీలు నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ. 65.05 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు.
ఎస్టీపీల పరిశీలన
త్వరలో ప్రారంభం కానున్న జీడిమెట్ల వెన్నెలగడ్డ ఎస్టీపీని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి సోమవారం సందర్శించారు. కూకట్పల్లి జోనల్ కమిషనర్ చౌహాన్‌తో పాటు కుత్బుల్లాపూర్ ఉప కమిషనర్ నర్సింహ, వివిధ విభాగాల అధికారులతో కలిసి చెరువు పరిసర ప్రాంతాన్ని పరిశీలించారు. అలాగే ఫతేనగర్ డివిజన్లో నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న మురుగు నీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ)ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. ఫతేనగర్ డివిజన్ ఎల్బీఎస్నగర్లో నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటున్న ఎస్టీపీని జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో కలిసి ఆమె సందర్శించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

