ఒక్క క్లిక్‌తో ఇంటికే ఆర్సీ
రవాణాశాఖలో ఆన్లైన్ సేవలకు పెద్దపీట వేస్తున్నారు. కార్యాలయాలకు రాకుండానే కేవలం ఒక్క క్లిక్‌తో సేవలు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 18 ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉండగా, ఇవి విజయవంతంగా కొనసాగుతున్నాయి.
- ఆర్టీఏలో మరో ఆన్లైన్ సేవ
- తప్పిన హైపోథెకేషన్ ఇబ్బందులు
- విజయవంతంగా వెయ్యి ఆర్సీలు జారీ
- ఇప్పటికే టీ యాప్ ఫోలియోలో 18 సేవలు
సిటీబ్యూరో, జనవరి 28 ( నమస్తే తెలంగాణ ) : రవాణాశాఖలో ఆన్లైన్ సేవలకు పెద్దపీట వేస్తున్నారు. కార్యాలయాలకు రాకుండానే కేవలం ఒక్క క్లిక్‌తో సేవలు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 18 ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉండగా, ఇవి విజయవంతంగా కొనసాగుతున్నాయి. వీటి సరసన ఇప్పుడు మరో ఆన్లైన్ సేవ అందుబాటులోకి వచ్చింది. అదే హైపోథెకేషన్ పూర్తయ్యాక కొత్త ఆర్సీ పొందడం. ఈ ప్రక్రియ గతేడాది జూన్‌లో మొదలైంది. బ్యాంకులతో ఆర్టీఏ అధికారులు విస్తృతంగా చర్చలు జరిపి ఈ సేవలను తీసుకొచ్చారు. సాధారణంగా వాహనదారుడు తన బ్యాంకు రుణం పూర్తయ్యాక బ్యాంకు జారీ చేసే ఎన్వోసీతో కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. ఇక మీదట అలా వెళ్లకుండానే ఆర్సీ జారీ చేసేలా అధికారులు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. దీని ప్రకారం బ్యాంకుల నుంచి సదరు వాహనదారుడి రుణం పూర్తయిందని ఆర్టీఏకు సమాచారం ఆటోమెటిక్‌గా వచ్చేస్తుంది. ఆ సమాచారం రాగానే సదరు వాహనదారుడి మొబైల్ నంబర్‌కు ఆర్టీఏ నుంచి ఆటో మెటిక్‌గా ఓ లింక్ చేరుతుంది. అది ఓపెన్ చేసి సాధారణ ఫీజు ఆన్లైన్లో చెల్లిస్తే సరిపోతుంది. వాహనాలను బట్టి ఫీజు ఉంటుంది. ఏ రోజు ఆర్సీ మీ ఇంటికి వస్తుందో కూడా సమాచారం తెలుస్తుంది. ఈ ప్రక్రియలో మన వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు చెల్లుబాటులో ఉండాలి. ఏవైనా గడువు ముగిసి ఉంటే ఆ లింక్‌లోనే హెచ్చరిస్తుంది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా రెన్యువల్ చేసుకుని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
వెయ్యి ఆర్సీలు జారీ
ఇప్పటికే ఆర్టీఏ అధికారులు కొత్త ప్రక్రియ ద్వారా 1157 ఆర్సీలు జారీ చేశారు. వాహనదారులు కార్యాలయాలకు రాకుండానే ఈ సేవలను పొందారు. మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ర్టాల్లో ఈ విధానం విజయవంతంగా కొనసాగుతుండటంతో అధికారులు తెలంగాణలోనూ ప్రారంభించారు.
కావాల్సిన సర్వీసుల కోసం..
స్మార్ట్‌ఫోన్‌లోని ప్లేస్టోర్ నుంచి టీ యాప్ ఫోలియోను డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అందులో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్-ఆర్టీఏ పై క్లిక్ చేస్తే కావాల్సిన సర్వీసులు ప్రత్యక్షమవుతాయి.
పారదర్శకమైన సేవలు..
వాహనదారులకు పారదర్శకమైన సేవలు అందించడమే మా లక్ష్యం. బ్యాంకు రుణాలపై వాహనాలు కొనుగోలు చేసిన వారు రుణ ప్రక్రియ పూర్తయ్యాక ఆర్సీ కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా ఆర్టీఏ నుంచి వారి మొబైల్‌కు లింక్ చేరుతుంది. ఆ లింక్‌ను ఓపెన్ చేసి వివరాలు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. పోస్టులో ఆర్సీ ఇంటికి చేరుతుంది. ఇప్పటికే టీ యాప్ ఫోలియోతో వాహనదారులు కార్యాలయానికి రాకుండానే సేవలు పొందుతున్నారు.
– రమేశ్, జేటీసీ, హైదరాబాద్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

