పదేండ్లు.. 10.52 కోట్లు.. దేశంలోనే అతిపెద్ద పథకంగా నిలిచిన పేదల అక్షయపాత్ర
అన్నపూర్ణ భోజన కేంద్రాలు పేదల పాలిట ‘అక్షయపాత్ర’గా మారాయి. ఆకలితో ఏ ఒక్కరూ అలమటించకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పంతో 2014 సంవత్సరం నుంచి అమలవుతున్న ఐదు రూపాయలకే భోజనం విజయవంతంగా కొనసాగుతున్నది.
- 10.50 కోట్ల మైలురాయిని దాటిన అన్నపూర్ణ భోజన పథకం
- 32 చోట్ల ప్రైవేట్ భోజనశాలలకు తీసిపోకుండా సకల సౌకర్యాలు
సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ) : అన్నపూర్ణ భోజన కేంద్రాలు పేదల పాలిట ‘అక్షయపాత్ర’గా మారాయి. ఆకలితో ఏ ఒక్కరూ అలమటించకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పంతో 2014 సంవత్సరం నుంచి అమలవుతున్న ఐదు రూపాయలకే భోజనం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 10 కోట్ల 52 లక్షల మందికి పైగా భోజనం అందించి దేశంలోనే అతిపెద్ద భోజన పథకంగా నిలిచింది.. ఇందుకోసం ప్రభుత్వం రూ. 210కోట్లు ఖర్చు చేసింది. హైదరాబాద్ నగరానికి పనులు, వివిధ వృత్తులు చేసుకునేందుకు వచ్చిన వారే కాకుండా విద్యార్థులు, నిరుద్యోగులకు అన్నపూర్ణ పథకం వారి దైనందిన జీవితంలో భాగమైంది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ వ్యాప్తంగా 32 అన్నపూర్ణ క్యాంటీన్లలో సిట్టింగ్ ఏర్పాటు చేసి ప్రైవేట్ భోజనశాలలకు ఏ మాత్రం తీసిపోకుండా అన్నపూర్ణ కేంద్రాలను మలిచారు. సకల సదుపాయాలు కల్పిస్తూ ఆకలి తీర్చడమే కాకుండా సంతృప్తిగా భోజనం చేశామన్న అనుభూతిని కల్పించేలా చర్యలు చేపట్టారు.
గ్రేటర్లో అమలు చేస్తున్న రూ. 5 రూపాయల అన్నపూర్ణ భోజన పథకం నగరంలో నిరుపేదల ఆకలిని తీర్చుతున్నది. హరే కృష్ణ మూవ్‌మెంట్‌తో కలిసి 1 మార్చి, 2014న 8 కేంద్రాలతో ప్రారంభమైన ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల అవసరాలను గుర్తించిన 259 కేంద్రాలకు పెంచింది. ప్రతి కేంద్రం ద్వారా రోజుకు 300 భోజనాలు అందించాలని లక్ష్యంగా ఒక రోజుకు మొత్తం 45 వేల భోజనాలు అందిస్తున్నారు. కాగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందే వారి కుటుంబ సభ్యులకు టిఫిన్, భోజన వసతి కోసం వ్యయ ప్రయాసలు ఇబ్బంది కలగకుండా వారికి సీఎం కేసీఆర్ టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి పూట భోజనం అందిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ పెద్ద ఆస్పత్రులకు గాను 17 ఆసుపత్రుల్లో రూ. 5లకే భోజనం అందిస్తున్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

