డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన మహిళ
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన మహిళను తప్పించేందుకు.. వాహనాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఇతర వాహనాలను ఢీకొట్టి పారిపోయిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..
- కారు పక్కకు తీస్తానంటూ.. ఉడాయింపు
బంజారాహిల్స్, ఏప్రిల్ 29: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన మహిళను తప్పించేందుకు.. వాహనాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఇతర వాహనాలను ఢీకొట్టి పారిపోయిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి బంజారాహిల్స్ రోడ్ నం. 14లోని స్టడీ సర్కిల్ సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన మహేంద్ర థార్‌ను ఆపారు. కారు నడిపిస్తున్న మహిళకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయగా.. మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. దీంతో కారును పక్కకు పార్క్ చేయాల్సిందిగా.. ట్రాఫిక్ పోలీసులు ఆమెకు సూచించారు. కాగా, పక్కసీటులో కూర్చున్న వ్యక్తి..
తాను కారును పక్కకు తీస్తానంటూ డ్రైవింగ్ సీట్లోకి వచ్చాడు. కారును వేగంగా వెనక్కి తీస్తూ బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు అడ్డుకునేందుకు యత్నించగా.. వేగంగా ముందుకు దూసుకెళ్లి బారికేడ్లను ఢీకొట్టడంతో పాటు అడ్డుగా వచ్చిన ట్రాఫిక్ హోంగార్డు దుర్గారావును ఢీకొట్టి.. అక్కడి నుంచి కారుతో సహా పారిపోయాడు. హోంగార్డు దుర్గారావు ఇచ్చిన ఫిర్యాదుతో కారు నడిపిన వ్యక్తిపై ఐపీసీ 332, 353, 279 రెడ్‌విత్ 34తో పాటు 184 ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా.. కారు బందుగల శివాలీరెడ్డి పేరుతో రిజిస్టర్ అయినట్లు పోలీసులు గుర్తించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

