సిటీబ్యూరో, అక్టోబర్ 28(నమస్తే తెలంగాణ): అమెరికాకు చెందిన ఏరోస్పేస్ ఉత్పత్తుల తయారీ కంపెనీ ప్రాట్ అండ్ విట్నీ ప్రతినిధుల బృందం శనివారం టీ హబ్‌ను సందర్శించారు. టీ హబ్ నిర్వహిస్తున్న కార్పొరేట్ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో భాగంగా ప్రాట్ అండ్ విట్నీ ప్రతినిధులు టీ హబ్‌లోని స్టార్టప్ కార్యకలాపాలను ప్రత్యేకంగా పరిశీలించారు.
ప్రధానంగా ఏరోస్పేస్ టెక్నాలజీలో కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై టీ హబ్ ప్రతినిధులతో వారు చర్చించారు. ఇప్పటికే ఏరోస్పేస్ రంగంలో టీ హబ్ ప్రోత్సాహంతో మంచి విజయాలు సాధించిన స్కైరూట్, ధృవ ఏరోస్పేస్ కంపెనీల కార్యకలాపాలపైనా చర్చించామని టీ హబ్ ప్రతినిధులు తెలిపారు. ఏరోస్పేస్ రంగానికి హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలపైనా వారు చర్చించారు.