హైదరాబాద్ : కల్తీ(Adulterated) అల్లం వెల్లుల్లి పేస్ట్(Ginger paste) చేసి అమ్ముతున్న ముఠాను మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితులు డక్కన్ ట్రేడర్స్ పేరుతో ఉప్పరపల్లిలో తయారు చేస్తున్నారు. బేగంపేట(Begumpet) కేంద్రంగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను అమ్ముతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 700 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.