మౌలాలి రైల్వేస్టేషన్లో బ్యాగు చోరీ.. నిందితుడి నుంచి భారీగా బంగారం, నగదు స్వాధీనం
GRP police: హైదరాబాద్లోని మౌలాలి రైల్వేష్టేషన్లో ఓ బ్యాగు చోరీకి గురైంది. మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైల్లో నుంచి నిందితుడు బ్యాగును చోరీ చేశాడు. ఈ ఘటనపై

మౌలాలి: హైదరాబాద్లోని మౌలాలి రైల్వేష్టేషన్లో ఓ బ్యాగు చోరీకి గురైంది. మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైల్లో నుంచి నిందితుడు బ్యాగును చోరీ చేశాడు. ఈ ఘటనపై జీఆర్పీ పోలీసులకు (గవర్నమెంట్ రైల్వే పోలీస్) ఫిర్యాదు అందడంతో వారు వెంటనే రంగంలోకి దిగారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతను మహారాష్ట్రకు చెందిన దశరథ్ (33)గా గుర్తించారు. జీఆర్పీ డీఎస్పీ చంద్రభాను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జులాయిగా తిరిగే నిందితుడు దశరథ్ గతంలో కూడా నాంపల్లి, సికింద్రాబాద్ లలో చోరీలకు పాల్పడ్డాడని డీఎస్పీ చంద్రభాను చెప్పారు. నిందితుడి నుంచి ఏడు లక్షల రూపాయల విలువ చేసే 14 తులాల బంగారం, లక్ష రూపాయల నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. దశరథ్పై మహారాష్ట్రలోని మహారాష్ట్రలోని శిలాపూర్లో మూడు కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఈ కేసులో దశరథ్తోపాటు రమేశ్ అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
నిందితులు ఇద్దరినీ రిమాండ్కు తరలిస్తున్నట్లు జీఆర్పీ డీఎస్పీ చంద్రభాను చెప్పారు. నిందితుడు దశరథ్ గతంలో ఐపీఎల్ బెట్టింగ్కు కూడా పాల్పడినట్లు ఆయన తెలిపారు. దశరథ్ ఇక్కడ చోరీలు చేసి దోచుకున్న సొమ్ముతో మహారాష్ట్రలో జల్సాలు చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందని డీఎస్పీ వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

