అన్నపూర్ణ క్యాంటీన్లు.. ఒక్కరోజే 45 వేల మీల్స్ సరఫరా

హైదరాబాద్ : నిరుపేదలకు రూ.5కే భోజనం అందించే అన్నపూర్ణ క్యాంటీన్లు జీహెచ్ఎంసీ పరిధిలో గురువారం ఒక్కరోజే 45 వేల భోజనాలను అందించింది. రోజువారీ కూలీలు, కార్మికులు, హాకర్లు, షెల్టర్ హోమ్స్‌లో ఆశ్రయం పొందేవారికి అన్నపూర్ణ క్యాంటీన్లు ఓ వరంగా మారాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్యాంటీన్లకు తోడుగా గురువారం డజన్ల సంఖ్యలో నూతన క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి.
గురువారం నగరంలోని 250 క్యాంటీన్లు వివిధ ప్రాంతాలలో 45 వేల మందికి పైగా ఆహారాన్ని అందించాయి. ప్రస్తుత లాక్డౌన్ సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో ఇబ్బంది పడకూడదన్న ఆశయంతో ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న క్యాంటీన్లకు అదనంగా మరో 102 క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది. శుక్రవారంతో నూతన క్యాంటీన్లన్నీ అందుబాటులోకి వస్తాయని జీహెచ్ఎంసీ అధికారి ఒకరు తెలిపారు. ఈ కష్ట కాలంలో తమకింత భోజనం పెడుతున్న ప్రభుత్వానికి లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

