Europe | వాతావరణ మార్పులతోనే యూరప్‌లో ఎండలు.. 50వేల మరణాలకు అవే కారణం..
యూరప్‌లో ఈ ఏడాది వేసవిలో నమోదైన రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు 50,391 మంది ప్రాణాలను బలిగొన్నాయి. వీరిలో 32,619 మంది మరణాలకు మానవ కార్యకలాపాల వల్ల పెరిగిన వాతావరణ మార్పులే కారణమని తాజా అధ్యయనం వెల్లడించింది. బొగ్గు, చమురు, సహజ వాయువుల వినియోగం కారణంగా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రాణాంతకంగా మారుతోందని పరిశోధకులు హెచ్చరించారు.
Europe | యూరప్‌లో ఈ ఏడాది వేసవిలో నమోదైన రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు 50,391 మంది ప్రాణాలను బలిగొన్నాయి. వీరిలో 32,619 మంది మరణాలకు మానవ కార్యకలాపాల వల్ల పెరిగిన వాతావరణ మార్పులే కారణమని తాజా అధ్యయనం వెల్లడించింది. బొగ్గు, చమురు, సహజ వాయువుల వినియోగం కారణంగా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రాణాంతకంగా మారుతోందని పరిశోధకులు హెచ్చరించారు.
50వేల మంది మృత్యువాత..
యూరప్‌లో ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టు నెలల్లో వరుసగా సంభవించిన తీవ్రమైన వడగాలుల కారణంగా 50,391 మంది మరణించినట్లు నేచర్ హెల్త్ జర్నల్‌లో ప్రచురితం అయిన అధ్యయనం వెల్లడించింది. యూరప్‌లోని 854 నగరాల్లో వివిధ వయసుల వారిపై ఉష్ణోగ్రతల ప్రభావాన్ని పరిశోధకులు విశ్లేషించారు. మొత్తం మరణాల్లో 32,619 మంది మానవ చర్యల కారణంగా పెరిగిన అదనపు వేడి ప్రభావంతోనే ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. 2022లో నమోదైన అత్యధిక వేసవి మరణాల సంఖ్య 29,480తో పోలిస్తే ఈ ఏడాది మరణాలు 71 శాతం ఎక్కువ. మే నెలలో సంభవించిన ప్రాణాంతక వడగాలులను, అధ్యయనంలో పరిశీలించిన 854 నగరాలకు వెలుపల జరిగిన మరణాలను లెక్కలోకి తీసుకోకపోవడంతో వాస్తవ మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు.
ఈ ఏడాదిలోనే అధికం..
జూన్ 17 నుంచి జూలై 1 వరకు సంభవించిన తీవ్రమైన వడగాలుల సమయంలోనే మొత్తం మరణాల్లో దాదాపు మూడో వంతు నమోదయ్యాయి. ఈ సమయంలో సాధారణం కంటే 5.3 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని యూరప్ నగరాల్లో సాధారణ స్థాయి కంటే ఏకంగా 12 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ దేశాల్లో అత్యధిక మరణాలు సంభవించాయి. 2000 నుంచి 2025 వరకు యూరప్ రాజధానుల్లో రోమ్‌లోనే అత్యధిక వేడి సంబంధిత మరణాలు నమోదయ్యాయి. మరణించిన వారిలో సగానికి పైగా 85 ఏళ్లు పైబడినవారే కాగా, 20 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న 800 మందికి పైగా కూడా ప్రాణాలు కోల్పోయారు. పారిశ్రామిక విప్లవానికి ముందు కాలంతో పోలిస్తే యూరప్‌లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 2.5 డిగ్రీల సెల్సియస్ పెరిగాయని, మానవ కార్యకలాపాల కారణంగా పెరుగుతున్న వేడి సాధారణ వేసవి ఉష్ణోగ్రతలను సైతం ప్రాణాంతక స్థాయికి తీసుకెళ్తోందని పరిశోధకులు హెచ్చరించారు.
కంప్యూటర్ సిమ్యులేషన్ల ద్వారా నిర్దారణ..
ఈ మరణాలను అంచనా వేయడానికి పరిశోధకులు వాతావరణ మార్పులు లేని ప్రపంచాన్ని ఊహిస్తూ కంప్యూటర్ సిమ్యులేషన్లు నిర్వహించారు. వాటిని ఈ ఏడాది వాస్తవ ఉష్ణోగ్రతలు, మరణాల గణాంకాలతో పోల్చి గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని లెక్కించారు. 2000వ దశకం ప్రారంభంలో వేడి కారణంగా సంభవించిన మరణాల్లో వాతావరణ మార్పుల వాటా సుమారు 45 శాతంగా ఉండగా, ప్రస్తుతం అది 65 శాతానికి పెరిగిందని పరిశోధకురాలు క్లెయిర్ బార్న్స్ తెలిపారు. వేడి సంబంధిత మరణాలు అధికారిక మరణ ధ్రువీకరణ పత్రాల్లో తరచూ నమోదు కాకపోవడంతో గణాంకాలను గణిత నమూనాల ద్వారా అంచనా వేసినట్లు పరిశోధకులు వివరించారు. బ్రిటన్‌లో మే, జూన్ వడగాలుల కారణంగా 2,700 అదనపు మరణాలు సంభవించినట్లు వీరు అంచనా వేయగా, అక్కడి ప్రభుత్వ ఆరోగ్య గణాంక సంస్థ 2,800 మరణాలను నమోదు చేసింది.
భవిష్యత్తులో మరణాలను తగ్గించేందుకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, తక్కువ కార్బన్ ఉద్గారాలతో కూడిన శీతలీకరణ సదుపాయాలు, వృద్ధులు, ప్రమాదంలో ఉన్నవారికి ప్రత్యేక సహాయక వ్యవస్థలు ఏర్పాటు చేయాలని వైద్య నిపుణులు సూచించారు. అదే సమయంలో శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా వాతావరణ మార్పులకు మూలకారణమైన ఉద్గారాలను నియంత్రించాలని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జోనాథన్ పాట్జ్ స్పష్టం చేశారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe | వాతావరణ మార్పులతోనే యూరప్‌లో ఎండలు.. 50వేల మరణాలకు అవే కారణం..
‘సీతారామ ప్రాజెక్టుతో సింగరేణి మండలానికి ఒరిగిందేమీ లేదు’
Hansika | హన్సిక పేరుతో ప్రైవేట్ వీడియో కలకలం.. డీప్‌ఫేక్ ప్రచారంపై అసలు నిజం ఇదే!
MLA Kalvakuntla Sanjay | అక్కడ పెద్దన్న, ఇక్కడ చిన్నన్న.. తెలంగాణను నిలువునా ముంచుతున్నారు : ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్
నెల్లిబండలో పంట మార్పిడిపై రైతులకు అవగాహన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

