‘థైరాయిడ్ క్యాన్సర్’ అనేది పురుషులతో పోలిస్తే స్త్రీలలో మూడురెట్లు ఎక్కువగా కనిపిస్తుంది. మనిషిలో హార్మోన్లను విడుదల చేసే పెద్ద గ్రంథులలో ‘థైరాయిడ్ గ్రంథి’ ఒకటి. మెడ కిందిభాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఈ గ్రంథి, ‘థైరాక్సిన్’ అనే హార్మోన్లను విడుదల చేస్తుంది. మనిషిలో జీవ ప్రక్రియలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. టీ3, టీ4 టీఎస్‌హెచ్ పరీక్షల ద్వారా థైరాయిడ్ హార్మోన్ల హెచ్చుతగ్గులను తెలుసుకోవచ్చు.
ఈ లక్షణాలు కనిపిస్తే.. హెచ్చుతగ్గులు ఉన్నట్లే!
ఈ సమస్యలు.. కాన్సర్‌కు కారణాలు
థైరాయిడ్ గ్రంథి మీద ఏర్పడిన గడ్డ లేదా కణితి అపరిమితంగా పెరగడమే థైరాయిడ్ క్యాన్సర్. చాలా
మందిలో వయసు పెరిగేకొద్దీ కనిపించే కణుతుల్లో 95శాతం వరకూ నాన్ క్యాన్సర్ కణుతులే. ప్రధానంగా జెనెటికల్ మ్యుటేషన్స్, రేడియేషన్‌కు ఎక్కువగా గురవడం, అణు విద్యుత్ కేంద్రాలకు దగ్గర్లో ఉండటం, కుటుంబ చరిత్రలో గాయిటర్ (థైరాయిడ్ గ్రంథి వాపు) తదితర సమస్యలు థైరాయిడ్ క్యాన్సర్‌కు దారితీసే
అవకాశాలు ఉన్నాయి.
ఎక్కువ మందిలో కనిపించే క్యాన్సర్ ఇదే థైరాయిడ్ క్యాన్సర్ ఐదు రకాలు. అందులో పాపిలరీ క్యాన్సర్ ఒకటి. థైరాయిడ్ క్యాన్సర్లలో 80 శాతం వరకు కనిపించేది ఈ క్యాన్సరే. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ తీర ప్రాంతవాసుల్లో పాపిలరీ క్యాన్సర్ అధికంగా కనిపిస్తున్నది. పిల్లలు ఎక్కువగా రేడియేషన్‌కు గురైనప్పుడు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఇక.. 2. ఫాలిక్యులార్ థైరాయిడ్ క్యాన్సర్. 3. మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్. 4. ఎనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్. ఇది చాలా అరుదైన, తీవ్రమైన క్యాన్సర్. 5. థైరాయిడ్ లింఫోమా.
లక్షణాలు
ఈ పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు
అల్ట్రాసౌండ్ నీడిల్ బయాప్సీ, న్యూక్లియర్ స్కాన్, సీటీ స్కాన్, ఎంఆర్ఐ, థైరాయిడ్ ఇమేజింగ్ తదితర పరీక్షల ద్వారా థైరాయిడ్ క్యాన్సర్‌ను నిర్ధారించడంతోపాటు వ్యాధి ఏ దశలో ఉంది? ఎంత వరకు వ్యాపించింది? అనే విషయాలను తెలుసుకోవచ్చు.
తీవ్రత ఆధారంగా చికిత్స
థైరాయిడ్ క్యాన్సర్ రకం, దశ ఆధారంగా చికిత్స అందించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో కేవలం కణితి వరకే తీసేయడం లేక మొత్తం థైరాయిడ్ గ్రంథినే తొలగించాల్సి వస్తుంది. ఆ తరువాత రేడియో యాక్టివ్ అయోడిన్, హార్మోన్ ట్రీట్మెంట్, బయటి నుంచి రేడియేషన్ ఇవ్వడం తదితర చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మెడ వద్ద చిన్నగా ఉన్న థైరాయిడ్ గడ్డలను కీహోల్ సర్జరీ ద్వారా తొలగించవచ్చు. అయితే ఈ సర్జరీ అతి సున్నితమైనది కాబట్టి, అనుభవజ్ఞులైన వైద్యులే చేయాల్సి ఉంటుంది.
శస్త్రచికిత్స తరువాత థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని జీవితాంతం వాడాల్సి ఉంటుంది. తొలుత కొంతకాలం పాటు ఈ థెరపీని ఎక్కువగా ఇచ్చి, థైరాయిడ్ హార్మోన్ల స్థాయులు పరిశీలించి సరైన మోతాదును నిర్ధారిస్తారు. సర్జరీ తరువాత కూడా ఎక్కడైనా క్యాన్సర్ కణాలు మిగిలి ఉంటే మళ్లీ శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు. అందుకని ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. థైరాయిడ్ క్యాన్సర్‌కు మెరుగైన చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ చికిత్స సక్సెస్ రేటు.. రోగి జీవితకాలం వంటి అంశాలు వ్యాధి తీవ్రత, ఏ దశలో గుర్తించి చికిత్స అందించారు? మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. రేడియేషన్, అణు విద్యుత్ కేంద్రాలకు దూరంగా ఉండటం ద్వారా ఈ క్యాన్సర్‌ను కొంత వరకు నివారించవచ్చు.
– డాక్టర్ మోహనవంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ 98490 22121