Throat problem | గొంతులో నొప్పి, మంట, గరగర వేధిస్తున్నాయా.. అయితే ఈ వంటింటి చిట్కా మీ కోసమే..!
Throat problem | గొంతులో సమస్య చాలా చిరాకు తెప్పిస్తుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఈ సమస్య ఎదురవుతూనే ఉంటుంది. గొంతులో గరగర (Throat Itching), భరించలేని గొంతు నొప్పి (Throat Pain), గొంతులో మంట లాంటి సమస్యలు మనలను కుదురుగా ఉండనివ్వవు. ఈ గొంతు సంబంధ బాధను మాటల్లో వర్ణించలేం.
Throat problem : గొంతులో సమస్య చాలా చిరాకు తెప్పిస్తుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఈ సమస్య ఎదురవుతూనే ఉంటుంది. గొంతులో గరగర (Throat Itching), భరించలేని గొంతు నొప్పి (Throat Pain), గొంతులో మంట లాంటి సమస్యలు మనలను కుదురుగా ఉండనివ్వవు. ఈ గొంతు సంబంధ బాధను మాటల్లో వర్ణించలేం. ఏది తిన్నా రుచించదు. గొంతు నొప్పిగా ఉన్నప్పుడైతే మంచినీళ్లు మింగబోయినా ప్రాణం పోయినంత బాధ కలుగుతుంది.
కొంతమందికి చల్లటి నీళ్లు తాగినప్పుడు లేదంటే ఏదైనా చల్లటి పదార్థం తిన్నప్పుడు గొంతు సమస్యలు వస్తాయి. కొందరికి చల్లటి పదార్థాలతో పెద్దగా సమస్యలు రాకపోయినా పానీపూరి, బజ్జీలు, మిర్చీలు లాంటి బయటి ఫుడ్స్ తిన్నప్పుడు గొంతులో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇలా గొంతుకు సంబంధించిన ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణమే ఉపశమనం కలిగించే వంటింటి చిట్కా ఒకటి ఉంది. మరి ఆ చిట్కా ఏంటో తెలుసుకుందామా..?
ఇదిగో చిట్కా
గొంతులో సమస్య ఉన్నప్పుడు ఒక పాత్రలో పావు లీటర్ నీళ్లు పోసి దాన్ని పొయ్యిమీద పెట్టాలి. ఆ నీళ్లలో చిన్న అల్లం ముక్క, రెండు యాలకులు, ఓ పదీ పన్నెండు తులసి ఆకులు, పావు స్పూన్ పసుపు వేసి బాగా మరిగించాలి. ఆ మరిగించిన నీటిని వడకట్టి తీయదనం కోసం ఒక స్పూన్ తేనె కలుపుకుని తాగాలి. అయితే.. మధుమేహం ఉన్నవాళ్లు మాత్రం తేనెను కలుపకపోయినా పర్వాలేదు. ఈ చిట్కా గనుక పాటిస్తే క్షణాల్లోనే మీ సమస్య పరిష్కారమవుతుంది. తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Throat problem | గొంతులో నొప్పి, మంట, గరగర వేధిస్తున్నాయా.. అయితే ఈ వంటింటి చిట్కా మీ కోసమే..!
Vishwak Sen | ఫ్యాన్స్ మీట్ వివాదంపై మరోసారి స్పందించిన విశ్వక్ సేన్.. ఆ రోజు జరిగిన తప్పుకు క్షమాపణలు!
Sir Patrick Stewart | హాలీవుడ్లో తీవ్ర విషాదం.. దిగ్గజ నటుడు సర్ పాట్రిక్ స్టీవర్ట్ కన్నుమూత
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’ టాస్క్.. నామినేషన్స్‌లో ఆరుగురు!
BTech Admissions | ఇంజినీరింగ్ చదువుకు తగ్గుతున్న క్రేజ్.. భారీగా తగ్గుతున్న బీటెక్ అడ్మిషన్లు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

