Health Tips | వీర్య కణాల సంఖ్య తగ్గొద్దంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Health Tips | కొత్తజీవి ఊపిరిపోసుకోవాలంటే.. పురుషుడి వీర్యకణాలు స్త్రీల అండంతో కలవాలి. జీవనశైలి లోపాల వల్లవీర్యకణాల సంఖ్య, నాణ్యతపై చెడు ప్రభావం పడుతున్నది.
Health Tips | కొత్తజీవి ఊపిరిపోసుకోవాలంటే.. పురుషుడి వీర్యకణాలు స్త్రీల అండంతో కలవాలి. జీవనశైలి లోపాల వల్లవీర్య కణాల సంఖ్య, నాణ్యతపై చెడు ప్రభావం పడుతున్నది. గర్భధారణకు గండాలు ఎదురవుతున్నాయి. కాబట్టి, బిడ్డను కనాలనుకునే దంపతులు.. వీర్య కణాలపై ప్రతికూల ప్రభావం చూపే అంశాల పట్ల అవగాహన పెంచుకోవాలి. పండంటి శిశువుకు జన్మనిచ్చే అవకాశాలు మరింత మెరుగుపర్చుకోవాలి.

సిగరెట్, ఆల్కహాల్: సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల్లో 2,000 రకాల రసాయనాలు ఉంటాయి. వాటిలో మరీ హానికరమైనది నికోటిన్. ధూమపానం వీర్యకణాల చలనాన్ని తగ్గించి వేస్తుంది. దీంతో కొన్ని వీర్యకణాలు మాత్రమే అండాన్ని చేరుకుంటాయి. అలా పురుషుల్లో ధూమపానం స్త్రీలకు మాతృత్వాన్ని దూరం చేస్తుంది. అంతే కాదు, వీర్యంలోని డీఎన్ఏకు హానిచేస్తుంది. దీంతో గర్భధారణ ఓ సమస్యగా మారుతుంది. మద్యపానంతో కూడా ఇవే సమస్యలు తలెత్తుతాయి. పైగా వీర్యకణాల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి, సంతానాన్ని కోరుకునే వాళ్లు ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.
ఊబకాయం: వీర్యకణాల నాణ్యత మీద ఊబకాయం తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సమస్య ఫలితంగా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈస్ట్రోజెన్, టెస్టోస్టిరాన్ హార్మోన్ల నిష్పత్తి మీద దెబ్బ పడుతుంది. అధిక బరువు సమస్య వృషణాల చుట్టూ ఉష్ణాన్ని అధికం చేస్తుంది. దీంతో వీర్యకణాల సంఖ్య, నాణ్యత రెండూ కూడా పడిపోతాయి.
గ్యాడ్జెట్లు, బిగుతు బట్టలు: ఎక్కువ కాలంపాటు ల్యాప్టాప్ వాడటం, నిత్యం బిగుతు ప్యాంట్లు ధరించడం వల్ల వృషణాలు అధిక వేడికి గురవుతాయి. ఇది వీర్యకణాల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. వాటి సంఖ్య, నాణ్యత తగ్గిపోతుంది. కాబట్టి, వృషణాల మీద ఒత్తిడి పడకుండా చూసుకోవాలి.
ఆహారం: వీర్యకణాల ఆరోగ్యం మీద ఆహారం ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ట్రాన్స్ఫ్యాట్లు అధికంగా ఉన్న రుచులు, ప్యాకేజ్డ్, రెడీ టు ఈట్ చిరుతిళ్లు.. వీర్యకణాల నాణ్యతను తగ్గిస్తాయి. చక్కెర అధికంగా ఉండే కార్బొనేటెడ్ పానీయాలు తాగకపోవడం మంచిది. తాజా పండ్లు, కూరగాయలు, ముతక ధాన్యాలతో కూడిన సమతుల ఆహారం తప్పక తీసుకోవాలి. ప్రాసెస్డ్ తిళ్లు, వేపుళ్లు సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి.
నిద్రలేమి: వీర్యకణాల ఆరోగ్యానికి కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం. క్రమబద్ధమైన నిద్ర అలవాటు లేకపోవడం, శారీరక శ్రమ కరువైపోవడం.. తదితర కారణాలు జీవన చక్రాన్ని దెబ్బతీస్తాయి. వీర్యకణాల చలనశీలత, నాణ్యత పెరగడానికి కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Bad Habits
- MAN
- Sperm Cells
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

