గొంతు నొప్పితో బాధపడుతున్నారా.. ఇలా చేయండి
Tulasi leaves: తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ తులసి ఆకులను ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి మేలే చేస్తాయి. గొంతునొప్పి, నోటి దుర్వాసన, నోట్లో పొక్కులు లాంటి ఎన్నో సమస్యలకు

హైదరాబాద్: తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ తులసి ఆకులను ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి మేలే చేస్తాయి. గొంతునొప్పి, నోటి దుర్వాసన, నోట్లో పొక్కులు లాంటి ఎన్నో సమస్యలకు తులసి ఆకులు తక్షణమే పరిస్కారం చూపిస్తాయి. మరి తులసి వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏమిటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
తులసితో ఇవీ ప్రయోజనాలు..
- చాలామందిని నోటి దుర్వాసన సమస్య వేధిస్తుంటుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు ప్రతిరోజూ రాత్రి నీళ్లలో తులసి ఆకులను నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటితో పళ్లు తోముకోవాలి. ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసన పోతుంది. నోట్లో పొక్కులు కూడా మానిపోతాయి.
- గొంతు నొప్పి కూడా చాలా మందిలో భరించరాని సమస్యగా ఉంటుంది. ఆ పదార్థాన్ని మింగినా తీవ్రమైన నొప్పి వస్తుంది. కొన్ని సందర్బాల్లో అయితే మంచినీళ్లను మింగాలన్నా గొంతు నొప్పి వేధిస్తుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు నీళ్లలో తులసి ఆకులు వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ నీళ్లు గోరువెచ్చగా మారగనే తాగాలి. దాంతో గొంతునొప్పి మటుమాయం అవుతుంది.
- ఇంకా తులసి రసంలో తేనె కలిపి తీసుకుంటే కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రెండింటిలోనూ యాంటీ సెప్టిక్ గుణాలు ఉండటంవల్ల చర్మ సమస్యలు దరిచేరవు. సాధారణ జలుబు, దగ్గు కూడా తగ్గుతాయి. నోటిపూతకు కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
- తులసి ఆకులకు శరీరంలో కొవ్వును తగ్గించే గుణం కూడా ఉంటుంది. తులసి ఆకులను ప్రతిరోజూ క్రమం తప్పకుండా మజ్జిగతో కలిపి తీసుకుంటే బరువు అదుపులో ఉంటుంది. ఇక నిద్రలేమితో బాధపడేవారు తులసి ఆకులను చక్కెరతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiru-Kamal | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. ‘మెగావర్స్’లో కమల్ హాసన్‌తో సందడి చేయనున్నారా?
US Fed Meeting | వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన అమెరికా కేంద్ర బ్యాంక్..!
Srikanth Odela | ‘ది ప్యారడైజ్’ విమర్శలు.. శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీపై ఆసక్తికర చర్చ!
South Carolina | అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు..!
Story competition | కథల పోటీలో ప్రతిభ చాటిన పావని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

