సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (సాడ్) అనేది డిప్రెషన్‌లాంటి మానసిక ప్రవర్తన. మరీ ముఖ్యంగా..
ఆయా రుతువుల ప్రారంభం, ముగింపు దశలలో కనిపిస్తుంది. కాబట్టే, ‘వింటర్ బ్లూస్’ అనీ పిలుస్తారు. అకారణంగా విచారంగా, నిరాశగా కనిపించడం ఈ సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ ప్రధాన లక్షణం. వాతావరణంలోని మార్పులు మనసుపై చూపే ప్రభావమే ఇందుకు కారణం.
ఒంటరితనం, నిద్రలేమి, అతినిద్ర, చిరాకు కూడా సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్‌కు దారి తీస్తాయని క్లినికల్ సైకాలజిస్టులు చెబుతారు. మరీ ఎక్కువ వెలుతురు, మరీ తక్కువ కాంతి.. మెదడును ప్రభావితం చేస్తాయి. ఫలితంగా మెలనిన్, సెరటోనిన్ హార్మోన్లు ప్రభావితం అవుతాయి. ‘సాడ్’కు ముఖ్య కారణం ఇదే. శ్వాస మీద ధ్యాస, యోగా, వ్యాయామంతో ఈ సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ నుంచి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.