Type-1 Diabetes | పెరుగుతున్న టైప్-1 డయాబెటిస్ ముప్పు.. ఈ లక్షణాలుంటే ప్రమాదంలో ఉన్నట్టే..!
Type-1 Diabetes | భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మధుమేహం ముప్పు పెరుగుతున్నది. దేశంలో టైప్-1 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతోందని ఇటీవల పరిశోధకుల బృందం గుర్తించి, ఈ విషయంలో హెచ్చరించింది. ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ జర్నల్‌లో అధ్యయనం
Type-1 Diabetes | భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మధుమేహం ముప్పు పెరుగుతున్నది. దేశంలో టైప్-1 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతోందని ఇటీవల పరిశోధకుల బృందం గుర్తించి, ఈ విషయంలో హెచ్చరించింది. ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ జర్నల్‌లో అధ్యయనం ప్రచురితమైంది. 2021 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 8.4 మిలియన్ల మంది టైప్-1 మధుమేహంతో బాధపడుతున్నారని అంచనా వేస్తుండగా.. ఈ సంఖ్య 2040 నాటికి 1.50 కోట్లకు పెరుగుతుందని అంచనా.
మధుమేహం ముప్పు ఎక్కువగా ఉన్న టాప్ 10 దేశాల్లో భారత్ కూడా ఒకటి. డయాబెటిస్‌లో ప్రధానంగా టైప్-1, టైప్-2 అనే రెండు రకాలు ఉన్నాయి. టైప్-1ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ అంటారు. దీనిలో రోగికి జీవితాంతం ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. అధ్యయనం ప్రకారం.. భారతదేశంతో పాటు, అమెరికా, బ్రెజిల్, చైనా, జర్మనీ, స్పెయిన్, కెనడా, యూకే, రష్యా, సౌదీ అరేబియా ఈ మధుమేహం వేగంగా పెరుగుతున్నది.
టైప్-1 డయాబెటిస్ గుర్తించి తెలుసా ?
టైప్-1 డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక సమస్య. దీంట్లో ప్యాంక్రియాస్ తక్కువ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొన్ని సందర్భాల్లో అస్సలే ఉత్పత్తి జరుగదు. ఇన్సులిన్ అనేది శరీరంలో ప్రవేశించే గ్లూకోజ్ నుంచి శక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడే హార్మోన్. టైప్-1 డయాబెటిస్‌కు ఇప్పటి వరకు చికిత్స లేదు. ప్రమాదాన్ని తగ్గించడానికి ఇన్సులిన్ ఇవ్వడం, ఆహారం, జీవనశైలిలో స్వల్ప మార్పులు చేయడం ద్వారా కొంత వరకు ప్రమాదాన్ని తగ్గింవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, ఈ మధుమేహానికి వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. టైప్-1 మధుమేహం సాధారణంగా బాల్యం, కౌమారదశలో కనిపిస్తుంటుందని వివరించారు.
డయాబెటిస్ సోకితే ఏం చేయాలి?
టైప్-1 డయాబెటిస్‌కు చికిత్స లేదు. ముప్పును నివారించేందుకు ఇన్సులిన్ అవసరమని నిపుణులు పేర్కొన్నారు. కాలక్రమేణా మధుమేహం శరీరంలోని ప్రధాన అవయవాలను ప్రభావితం చేస్తాయి. గుండె, రక్త నాళాలు, నరాలు, కళ్లు, మూత్రపిండాల సంబంధిత సమస్యలు ఎదురవుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణ రక్తంలో చక్కెర స్థాయిలను కలిగి ఉండడం అలాంటి అనేక సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇన్సులిన్‌తో పాటు జీవనశైలి మార్పులను చేసుకోవడం ద్వారా అదుపులో ఉంచవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
లక్షణాలు ఇవీ..
టైప్-1 డయాబెటిస్ సాధారణంగా కౌమారదశలో కనిపిస్తుంది. అయినప్పటికీ, ఇది పెద్దలను కూడా ప్రభావితం చేస్తుంది. దాని లక్షణాలు చాలా వరకు టైప్-2 డయాబెటిస్‌ను పోలి ఉంటాయి. వాటిని సకాలంలో గుర్తించడం, సరైన చికిత్సను నిర్ధారించడం అవసరం. ఇలాంటి లక్షణాల పట్ల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణం కంటే ఎక్కువ దాహం, ఆకలిగా అనిపిస్తూ ఉంటుంది. తరచుగా ఎక్కువగా మూత్రం వస్తుంటుంది. బరువు తగ్గుతుంటారు. చిరాకుగా అనిపిస్తుంటుంది. అలసట, బలహీనంగా అనిపిస్తుంటుంది. అలాగే కంటిచూపు మసకబారుతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

