Broccoli | జలుబుకు బై బై.. బ్రకోలి
సాధారణ జలుబు, ఫ్లూ వల్ల జ్వరం, గొంతు గరగర, ముక్కు కారడం, దగ్గు, తుమ్ములు తీవ్రంగా ఇబ్బందిపెడతాయి. జలుబు దాదాపు రెండొందల రకాల వైరస్ల వల్ల వస్తుందనేది తెలిసిన విషయమే. ఫ్లూ మాత్రం ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కారణంగా దాపురిస్తుంది.
సాధారణ జలుబు, ఫ్లూ వల్ల జ్వరం, గొంతు గరగర, ముక్కు కారడం, దగ్గు, తుమ్ములు తీవ్రంగా ఇబ్బందిపెడతాయి. జలుబు దాదాపు రెండొందల రకాల వైరస్ల వల్ల వస్తుందనేది తెలిసిన విషయమే. ఫ్లూ మాత్రం ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కారణంగా దాపురిస్తుంది. ఈ రెండు సమస్యలనూ అధిగమించాలంటే.. ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే.. సమతులమైన, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి. కార్బొహైడ్రేట్లు (పిండి పదార్థాలు), విటమిన్లు, ఖనిజ లవణాలు (మినరల్స్), ఒమేగా-3, ఫొలేట్, ఫ్యాటీ ఆమ్లాలు భోజనం పళ్లెంలో నిండుగా పడాలి. అదనంగా ఫైటో కెమికల్స్ ఉండాలి. ఇవన్నీ బ్రకోలిలో అపారం. ఈ పోషకాలకు వాపులను తగ్గించే గుణాలు ఉంటాయి.

బ్రకోలిలోని క్యుసెర్టిన్ అనే ఫ్లేవనోల్ వాయునాళాల్లో తిష్టవేసిన వైరస్ల సంఖ్యను తగ్గిస్తుంది. దీనివల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. తరచూ బ్రకోలి తింటే ఫ్లూ నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఇందులో ఉన్న సల్ఫోరాఫేన్ ముక్కు ద్వారాల్లో ఉండే వాపులను తగ్గిస్తుందని అనేక అధ్యయనాల్లో నిర్ధారణ అయ్యింది. ఇది క్యాబేజీ కుటుంబానికి చెందినది. బ్రకోలి జన్మ స్థానం ఇటలీ అని చెబుతారు. వయసు రెండువేల సంవత్సరాలు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

