Oral health: మీ నోరు శుభ్రంగా ఉంటే వృద్ధాప్యంలో ఆ సమస్యే రాదు!!
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది' అని మనం మట్లాడే మాటల గురించి అన్నారు పెద్దలు. కానీ, ఇప్పడు మన నోరు మంచిదైతే.. అంటే శుభ్రంగా ఉంటే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దంతాలు లేదా నోటి శుభ్రతపై జీవక్రియ, గుండె ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని గత అధ్యయనాల్లో తేలింది. తాజాగా, నోటి ఆరోగ్యం బాగుంటే వృద్దాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి (అల్జీమర్స్) రాదని పరిశోధకులు గుర్తించారు. చిగుళ్ల వ్యాధి వల్ల ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని తేల్చారు. అందువల్ల క్రమంతప్పకుండా దంత వైద్యుడిని సంప్రదించడం అవసరమని తెలిపారు.
‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అని మనం మట్లాడే మాటల గురించి అన్నారు పెద్దలు. కానీ, ఇప్పడు మన నోరు మంచిదైతే.. అంటే శుభ్రంగా ఉంటే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దంతాలు లేదా నోటి శుభ్రతపై జీవక్రియ, గుండె ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని గత అధ్యయనాల్లో తేలింది. తాజాగా, నోటి ఆరోగ్యం బాగుంటే వృద్దాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి (అల్జీమర్స్) రాదని పరిశోధకులు గుర్తించారు. చిగుళ్ల వ్యాధి వల్ల ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని తేల్చారు. అందువల్ల క్రమంతప్పకుండా దంత వైద్యుడిని సంప్రదించడం అవసరమని తెలిపారు.
అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డెంటల్ మెడిసిన్ నిపుణులు ఎలుకలపై పరిశోధన చేసి ఈ విషయాన్ని తేల్చారు. ఎలుకల్లో చిగుళ్ల వ్యాధికి కారణమవుతున్న ఎఫ్ న్యూక్లియేటమ్ అనే బ్యాక్టీరియా
అల్జీమర్స్‌కు కూడా కారణమవుతోందని తేల్చారు. జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యాలను తగ్గిస్తుందని గుర్తించారు. ఇది మంటను కూడా కలిగిస్తుందని కనుగొన్నారు. డెడ్ న్యూరాన్లను మెదడు వదిలించుకునే విధానాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసి అల్జీమర్స్ పురోగతికి మార్గం సుగమం చేస్తుందని తేల్చారు.
చిగుళ్ల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించే చిట్కాలు
చిగుళ్ల వ్యాధి ప్రమాదాన్ని అధిగమించేందుకు ఉత్తమమైన మార్గం నోటి పరిశుభ్రత. వయస్సు పెరిగేకొద్దీ ఇది కాస్త కష్టసాధ్యమైన పని. అలాగే, క్యాన్సర్ లేదా మధుమేహంతో పోరాడుతున్న వారు లేదా ధూమపానం చేసేవారిలో నోటి శుభ్రత లోపిస్తుంది. మరి దీన్ని అధిగమించేందుకు ఉత్తమ చిట్కాలను పరిశోధకులు సూచించారు.
- ప్రతి ఆరు నెలలకోసారి దంతవైద్యుడిని సంప్రదించాలి.
- రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోవాలి.
- బ్రష్ చేసిన తర్వాత పేస్ట్‌ను ఉమ్మి వేయాలి.. అలాగే ఉంచుకోవద్దు.
- క్రమం తప్పకుండా ఫ్లాసింగ్ చేయించుకోవాలి.
- మూడు నెలలకోసారి టూత్ బ్రష్‌ను మార్చాలి.
- పొగతాగే అలవాటును వదులుకోవాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
KTR | తెలంగాణ నా గోత్రం… సిరిసిల్ల కులం.. మీరుపెట్టిన భిక్షతోనే ఇంతదాక ఎదిగిన.. కేటీఆర్ భావోద్వేగం
Trivikram | ప్రభాస్‌లో ఆ యాంగిల్‌ను ఎవరూ చూపించలేదు.. త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

