Health Tips | పరిశోధకుల వార్నింగ్ బెల్స్ : లౌడ్ మ్యూజిక్‌తో లయ తప్పుతున్న గుండెలు
భారీ శబ్ధాలు, లౌడ్ మ్యూజిక్ కారణంగా (Health Tips) పలువురు మృత్యువాతన పడుతున్నారు.
న్యూఢిల్లీ : భారీ శబ్ధాలు, లౌడ్ మ్యూజిక్ కారణంగా (Health Tips) పలువురు మృత్యువాతన పడుతున్నారు. మార్చి 4న బిహార్‌లోని సీతామర్హిలో పెండ్లి వేదికపైనే వరుడు కుప్పకూలి మరణించిన ఘటన కలకలం రేపగా, తెలంగాణలో ఇటీవల జరిగిన మరో ఘటనలో మ్యూజిక్కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ 19 ఏండ్ల యువకుడు మరణించాడు. గత ఏడాది నవంబర్‌లో వారణాసిలో ఓ పెండ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ ఓ వ్యక్తి గుండెపోటుకు గురై కుపక్పకూలాడు. ఎలాంటి మ్యూజిక్ అయినా అది భారీ శబ్ధంతో కూడినదైనా, మంద్రస్ధాయిలో ఉన్నా అది మనిషి గుండెను బలహీనపరుస్తుందని, స్ట్రోక్ ముప్పు పెంచుతుందని 2019 నవంబర్‌లో ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయన వివరాలు యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
500 మంది ఆరోగ్యకరమైన పెద్దలపై ఈ అధ్యయనం నిర్వహించారు. వీరంతా బిజీ మార్కెట్ ప్రాంతాల్లో పనిచేయడం లేదా నివసిస్తూ తరచూ లౌడ్ మ్యూజిక్కు ఎక్స్పోజ్ అవుతుంటారు. ఐదేండ్ల పాటు నిర్వహించిన ఈ అధ్యయనంలో హృద్రోగ లక్షణాలు లేనివారు కూడా కార్డియోవాస్క్యులర్ వ్యాధులకు గురైనట్టుగా వెల్లడైంది. భారత్‌లో కొద్దినెలలుగా లౌడ్ మ్యూజిక్‌ను భరించలేక ప్రజలు ఉన్నట్టుండి కుప్పకూలడం, కొన్ని కేసుల్లో మరణాలు సంభవించిన ఘటనలు గణనీయంగా నమోదవుతున్నాయి.
కాలుష్యం వంటి హృద్రోగ ముప్పులను పక్కనపెడితే 24 గంటల సగటు శబ్ధాల స్ధాయిలో పెరిగిన ప్రతి 5 డెసిబుల్ లెవెల్‌కు హార్ట్ ఎటాక్స్, స్ట్రోక్స్, ఇతర తీవ్ర హృద్రోగాల ముప్పు 34 శాతం పెరుగుతుందని అధ్యయనంలో వెల్లడైంది. జర్మనీలోని మైంజ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ 15,000 మందిపై చేపట్టిన అధ్యయనంలో కూడా ఇలాంటి వివరాలే వెల్లడయ్యాయి. నిర్ధిష్ట పరిమితిని మించిన మ్యూజిక్‌తో మానవ గుండెలపై హానికారక ఎఫెక్ట్ చూపుతుందని స్పష్టం చేసింది.
లౌడ్ మ్యూజిక్కు ఎక్స్పోజ్ అయిన వారి గుండె వేగంగా కొట్టుకుంటుందని పేర్కొంది. గుండె అస్తవ్యస్తంగా కొట్టుకునే అర్టియల్ ఫిబ్రిలేషన్‌తో గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్, రక్తనాళాల్లో పూడికల వంటి ముప్పు పొంచిఉందని తెలిపింది. 50-70 డెసిబల్స్‌కు మించిన శబ్ధాలు ప్రమాదకరమని ఇవి మానవ గుండె, మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
Read More :
Jowar benefits | బీపీ, షుగర్ రోగులు బేఫికర్‌గా ఉండాలంటే.. డైలీ డైట్లో ఈ చిరుధాన్యం ఉండాల్సిందే..
National Dentist Day | దంతాలను ఎవరూ డొనేట్ చేయలేరు.. ఈ పద్ధతులు పాటిస్తూ జాగ్రత్తగా కాపాడుకోండి
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

