ఎలర్జీ గండం!
పరిసరాల కాలుష్యం వల్ల అనేక వ్యాధులు వస్తుంటాయి. వీటిలో ప్రధానమైనవి శ్యాసకోశ రుగ్మతలు. ఇంట్లో దుమ్ముతోపాటు వీధిలోని దుమ్ము కారణంగా కూడా శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. బయటి దుమ్ములో కొన్ని రసాయనాలు, పుప్పొడి ఉంటాయి. ఇంట్లోనిదుమ్ము అనేక పదార్థాల మిశ్రమం. దానిలో కాటన్ ఫైబర్, జంతువుల బొచ్చు, చనిపోయిన కీటకాల శరీర భాగాలు, ఆహార వ్యర్థాలు.. ఇలా ఎన్నో ఉంటాయి. 70 శాతం ఆస్తమా రోగులకు ఇంట్లో దుమ్మువల్ల ఎలర్జీ తలెత్తుతుంది. పాత ఇండ్లలో ఈ సమస్య మరీ ఎక్కువ.

డస్ట్‌మైట్: ఇది ఇంటి దుమ్ములోని ప్రధానమైన సూక్ష్మజీవి. దీని ప్రధాన స్థావరాలు పడకగదిలోని పరుపులు, దిండ్లు. తరచుగా ఉతకడం వీలు కాని ఉన్ని బ్లాంకెట్స్, దళసరి గుడ్డలతో చేసిన సోఫాలలోనూ ఇవి నివాసముంటాయి. డస్ట్మైట్ను వాక్యూమ్ క్లీనింగ్‌తో పూర్తిగా తొలగించలేం. వ్యక్తి మంచం ఎక్కగానే లక్షణాలు ప్రారంభమవుతాయి. తిరిగి ఉదయం తుమ్ములు, ఆయాసంతో మేల్కొంటారు. ఇంట్లోనుంచి బయటకు వెళ్లగానే ఆ లక్షణాలు కనిపించవు. పిల్లలు 80 శాతం సమయం పడకగదిలోనే గడుపుతారు. కాబట్టి, పడకగదిని ఎప్పుడూ శుభ్రం చేసుకోవాలి. తివాచీలు, సోఫాలు పడకగదిలో ఉంచవద్దు. పరుపులు, దిండ్లు వారానికి రెండుసార్లు దులిపి ఎండలో ఆరేయాలి.
బొద్దింకలు: ఇవి చీకటి సమయాన వంటగదిలోకి వస్తుంటాయి. వీటి మలం ఎలర్జీలకు ప్రధాన కారణం. బొద్దింకలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
జంతువులు: బొచ్చు, ఈకలు కలిగిన ఏ జంతువైనా ఎలర్జీకి కారణం కావచ్చు. ప్రధానమైనవి కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, ఎలుకలు, పక్షులు. అన్నిటికన్నా ప్రమాదకరమైనవి పిల్లి లాలాజలం, దాని వెంట్రుకలు, చర్మం నుంచి రాలే పొడి. జంతువులను ఇంటి బయటే ఉంచి, వాటికి తరచుగా స్నానం చేయిస్తూ వెంట్రుకలను, శరీరాన్ని శుభ్రంగా ఉంచాలి.
పుప్పొడి: చెట్లు, గడ్డి, కలుపు, పూల పుప్పొడి వల్లకూడా ఎలర్జీ వస్తుంది. గాలివల్ల పుప్పొడి చాలా దూరం ప్రయాణిస్తుంది. వేడి, గాలి వేగం ఎక్కువగా ఉన్న వాతావరణంలో ఈ అలర్జీ ఎక్కువ.
ఎయిర్ కండిషనర్: పుప్పొడి, ఫంగస్ ఎలర్జీ ఉన్నవారికి ఎయిర్ కండిషనర్ బాగా ఉపయోగపడుతుంది. పడకగది ఏసీ, ఉదయం ఆస్తమా నుంచి చాలావరకు రక్షిస్తుంది. దీనివల్ల డస్ట్‌మైట్ సంఖ్యకూడా తగ్గుతుంది. గాలిని ‘రీ సర్క్యులేట్’ చేస్తూ ఫిల్టర్‌ను తరచుగా శుభ్రం చేస్తుండాలి.
ఎలర్జీ ఎక్కువగా ఉన్నవారు ‘గాలి ఫిల్టర్’ను వాడవచ్చు. ఉదయం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి, రాత్రి అకస్మాత్తుగా తగ్గినప్పుడు ఆస్తమా రావచ్చు. వంటచెరకు, బొగ్గులనుంచి వచ్చే పొగ, తైలం, గ్యాస్‌ల నుంచి వచ్చే పొగకన్నా ప్రమాదకరం. పొగతాగేవారి కుటుంబాలలో నివసించే పిల్లల్లో దగ్గు, జలుబు తరచుగా, దీర్ఘంగా, తీవ్రంగా ఉంటాయి. దీని ప్రభావం నాలుగు వారాల వయసు పిల్లలపై కూడా ఉంటుంది.
డాక్టర్ కర్రా రమేష్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- cold
- Kids-and-cold
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

