Health Tips | పంటినొప్పికి.. ఇంటి చిట్కాలు
పంటినొప్పి.. భరించలేని సమస్య. దాని ప్రభావం ముఖం, తలమీద కూడా ఉంటుంది. కారణం ఏదైనా పంటినొప్పికి మనవాళ్లు ఇంటిచిట్కాలకే ప్రాధాన్యం ఇస్తారు.
Health Tips | పంటినొప్పి.. భరించలేని సమస్య. దాని ప్రభావం ముఖం, తలమీద కూడా ఉంటుంది. కారణం ఏదైనా పంటినొప్పికి మనవాళ్లు ఇంటిచిట్కాలకే ప్రాధాన్యం ఇస్తారు. అలాంటి ప్రభావవంతమైన చిట్కాలు ఓ ఐదు ఉన్నాయి. అయితే, ఇవి వైద్యుడి చికిత్సకు ప్రత్యామ్నాయాలు మాత్రం కాదు. చిట్కాలు ప్రయోగించినా పంటినొప్పి తగ్గలేదంటే వైద్యుణ్ని సంప్రదించడం మానుకోవద్దు.
ఉప్పునీళ్లు
ఉప్పులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఉప్పునీళ్లను పుక్కిలించినప్పుడు నోట్లో ఉండే బ్యాక్టీరియా నశించిపోతుంది. నొప్పి, మంట కూడా తగ్గిపోతుంది. దీనికోసం ఓ గ్లాసు గోరువెచ్చటి నీళ్లలో టీస్పూన్ ఉప్పు కలుపుకోవాలి. ఈ ద్రావణాన్ని ఓ ముప్పై సెకండ్లపాటు పుక్కిలించి ఉమ్మేయాలి. ఇలా రోజులో కొన్నిసార్లు చేస్తూ ఉండాలి. ముఖ్యంగా తిన్న తర్వాత, పడుకునే ముందు పుక్కిలించడం మర్చిపోవద్దు.
లవంగం నూనె
పంటినొప్పి ఉపశమనానికి వందల ఏండ్లుగా లవంగం నూనెను ఉపయోగిస్తున్నారు. ఇందులో కూడా ఎనల్జీసిక్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువే. లవంగం నూనెలో ఉండే యూజెనాల్ అనే మూలకం పంటినొప్పి నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తుంది. పత్తి ఉండను తీసుకుని దాన్ని కొన్నిచుక్కల లవంగం నూనెతో తడపాలి. తర్వాత నొప్పిగా ఉన్న దంతాలు, చిగుళ్ల దగ్గర మర్దన చేయాలి. రోజులో పలుమార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
మంచుముక్కలు
ఓ పల్చటి వస్త్రంలో మంచుముక్కలు తీసుకోవాలి. దీంతో నొప్పి ఉన్న దగ్గర్లో బుగ్గపై రుద్దుకోవాలి. ఇలా ఓ పది పదిహేను నిమిషాలపాటు చేస్తే నొప్పి ఉన్నచోట మొద్దుబారినట్టుగా ఉంటుంది. పంటినొప్పిని తప్పించుకోవడానికి ఈ ప్రక్రియను కొన్నిగంటలకోసారి చేస్తూ ఉండాలి.
పెప్పర్మింట్ టీ
దీనిలో పుదీనా ఉంటుంది. దీనికి నోటిని చల్లగా చేస్తూ తిమ్మిరి కలగజేసే గుణాలు ఉంటాయి. పెప్పర్మింట్ టీని నోట్లోకి తీసుకోవడం ద్వారా పంటినొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. చల్లటి పెప్పర్మింట్ టీని నోట్లో ఓ ముప్పై సెకండ్లపాటు పుక్కిలించి ఉమ్మేయడం మంచిది. పెప్పర్మింట్ టీ బ్యాగ్‌ను నొప్పి ఉన్నచోట ఉంచినా ఇదే ఫలితం ఉంటుంది. ఇలా వీలైనన్ని సార్లు చేయాలి.
వెల్లుల్లి
వెల్లుల్లిలో యాంటీమైక్రోబియల్, యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీనిలో ఉండే అలిసిన్ చెడు బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఓ వెల్లుల్లి రేకును మెదుపుకోవాలి. దీన్ని నేరుగా చిగుళ్లు, పంటిపై ఉంచాలి. వెల్లుల్లి రేకును, పేస్టును చప్పరించినా మంచి ఫలితాలే ఉంటాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

