నడి వయసు పరీక్షలివే..
ఓ వయసుకు చేరుకున్నాక జీవితం సవ్యంగా సాగాలంటే.. శరీరం గురించి తప్పక ఆలోచించాలి. అందులోనూ, పురుషులకు 50 ఏండ్లు ఓ మైలురాయి. ఐదుపదుల వయసులో జీవన నాణ్యత మరింత పెంచుకోవాలి
ఓ వయసుకు చేరుకున్నాక జీవితం సవ్యంగా సాగాలంటే.. శరీరం గురించి తప్పక ఆలోచించాలి. అందులోనూ, పురుషులకు 50 ఏండ్లు ఓ మైలురాయి. ఐదుపదుల వయసులో జీవన నాణ్యత మరింత పెంచుకోవాలి. వయసురీత్యా వచ్చే రుగ్మతలను నియంత్రించుకోవాలి. గుండె, మూత్రపిండాలు, కాలేయం పనితీరును సమగ్ర పరీక్షలు, స్కానింగ్ ద్వారా బేరీజువేసుకోవాలి.
మధుమేహం
ఏండ్ల తరబడి ఎలాంటి లక్షణాలూ బయటపడకుండా.. శరరంపై దాడిచేసే ‘నిశ్శబ్ద హంతకి’ డయాబెటిస్. రక్తంలో షుగర్ పరిమితికి మించి ఉన్నవాళ్లు క్రమం తప్పకుండా మధుమేహ పరీక్షలు చేయించుకోవాలి.
సీరం పీఎస్ఏ
సీరం పీఎస్ఏగా పిలిచే రక్త పరీక్ష .. వ్యాధుల నిర్ధారణలో అత్యంత కీలకమైంది. మూత్రాశయం, మూత్రనాళం మధ్య ఉండే చిన్న గ్రంధి.. ప్రొస్టేట్. 45-50 ఏండ్ల మధ్య చాలామంది పురుషులకు.. హార్మోన్లలో మార్పుల కారణంగా ప్రొస్టేట్ గ్రంధిలో వాపు వస్తుంది. అది క్యాన్సర్కు సూచన కావచ్చు. ప్రొస్టేట్ గ్రంధికి క్యాన్సర్ సోకే ప్రమాదం ఎక్కువ. కాబట్టి, ఈ పరీక్ష తప్పనిసరి.
గుండె పనితీరు
గుండెపోటు సాధారణ విషయమైపోయింది. జీవనశైలి, పరిసరాలు గుండె అనారోగ్యానికి ప్రధాన కారణాలు. అయితే గుండె లయ తప్పడాన్ని తొలినాళ్లలోనే గుర్తిస్తే, లోపాన్ని సరిదిద్దుకోవడం సాధ్యమే. ఇకనుంచి అయినా మీ రక్తపోటు (బీపీ), గుండె ఆరోగ్యం గురించి ఆలోచించండి. తరచూ తగిన వైద్య పరీక్షలు చేయించుకోండి.
టెస్టోస్టిరాన్ స్థాయులు
లైంగిక నిరాసక్తత, వైఫల్యం వయసు పైబడుతున్న దశలో సహజమే. అలా అని, సమస్యతో నిశ్శబ్దంగా కుమిలిపోవాల్సిన పన్లేదు. రుగ్మత మూలాలను తెలుసుకోవడానికి పురుష హార్మోన్ టెస్టోస్టిరాన్ స్థాయిని పరీక్షించుకోవాలి. అంగస్తంభన సమస్యనూ తేలికగా తీసుకోలేం. గుండె అనారోగ్యానికి ఇదో సంకేతం కావచ్చు.
చర్మ క్యాన్సర్
పురుషులు చర్మ సంరక్షణను అంతగా పట్టించుకోరు. అంతేకాదు, వృత్తి ఉద్యోగాలలో భాగంగా ఎక్కువ సమయం ఎండలోనే గడుపుతారు. సూర్యుడి నుంచి సోకే అతినీల లోహిత కిరణాల బారినపడటం, చర్మ సంరక్షణను నిర్లక్ష్యం చేయడం తదితర కారణాల వల్ల ఈ క్యాన్సర్కు గురయ్యేవారి సంఖ్య పెరుగుతున్నది. కాబట్టి, చర్మ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు తప్పక చేయించుకోవాలి.
.. వీటన్నిటితోపాటు ఆరోగ్యవంతమైన జీవనశైలి, పోషకాలతో కూడిన ఆహారం, మద్యపానం-ధూమపానం తదితర వ్యసనాలకు దూరంగా ఉండటం, ఒత్తిడిని అధిగమించడం, చురుకైన సామాజిక జీవితం, వారానికి ఐదు రోజుల వ్యాయామం.. మగవారి ఆరోగ్యానికి రక్షణ కవచాలుగా నిలుస్తాయి. వ్యాధులను అధిగమించే శక్తినిస్తాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

