పై పెదవిపై అవాంఛిత రోమాలు మహిళల సౌందర్యానికి అవరోధం. వాటిని తొలగించుకోవడం ఓ సమస్య. ప్రతీసారి పార్లర్కు వెళ్లడం కుదరదు. నిజానికి, అవాంఛిత రోమాలను వదిలించుకునేందుకు అనేక చిట్కాలున్నాయి. నిపుణుల సలహాతో వీటిని పాటించవచ్చు.
గుడ్డు తెల్లసొన, పసుపు: గుడ్డులోని తెల్లసొనకు అతుక్కునే స్వభావం ఉంటుంది. అవాంఛిత రోమాలను సున్నితంగా తొలగించడంలోనూ సాయపడుతుంది. చర్మంలోని రంధ్రాలను తగ్గించి, ముఖంపై ముడతలు లేకుండా చేస్తుంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. తెల్లసొన, పసుపు మిశ్రమాన్ని పెదవిపై రాసుకుని, ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
చక్కెర, తేనె, నిమ్మకాయ: ఈ మూడింటి మిశ్రమానికి మైనాన్ని తలపించే గుణం ఉంటుంది. ఈ మిశ్రమాన్ని పెదవిపై రాసి ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.