Throat problem | గొంతులో సమస్యతో చిరాకుగా ఉందా.. అయితే ఈ వంటింటి చిట్కా మీ కోసమే..!
Throat problem | గొంతులో సమస్య చాలా చిరాకు తెప్పిస్తుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఈ సమస్య ఎదురవుతూనే ఉంటుంది. గొంతులో గరగర, భరించలేని గొంతు నొప్పి, గొంతులో మంట లాంటి సమస్యలు మనలను కుదురుగా ఉండనివ్వవు. ఈ గొంతు సంబంధ బాధను మాటల్లో వర్ణించలేం. ఏది తిన్నా రుచించదు. గొంతు నొప్పిగా ఉన్నప్పుడైతే మంచినీళ్లు మింగబోయినా ప్రాణం పోయినంత బాధ కలుగుతుంది.
Throat problem : గొంతులో సమస్య చాలా చిరాకు తెప్పిస్తుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఈ సమస్య ఎదురవుతూనే ఉంటుంది. గొంతులో గరగర, భరించలేని గొంతు నొప్పి, గొంతులో మంట లాంటి సమస్యలు మనలను కుదురుగా ఉండనివ్వవు. ఈ గొంతు సంబంధ బాధను మాటల్లో వర్ణించలేం. ఏది తిన్నా రుచించదు. గొంతు నొప్పిగా ఉన్నప్పుడైతే మంచినీళ్లు మింగబోయినా ప్రాణం పోయినంత బాధ కలుగుతుంది.
కొంతమందికి చల్లటి నీళ్లు తాగినప్పుడు లేదంటే ఏదైనా చల్లటి పదార్థం తిన్నప్పుడు గొంతు సమస్యలు వస్తాయి. కొందరికి చల్లటి పదార్థాలతో పెద్దగా సమస్యలు రాకపోయినా పానీపూరి, బజ్జీలు, మిర్చీలు లాంటి బయటి ఫుడ్స్ తిన్నప్పుడు గొంతులో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇలా గొంతుకు సంబంధించిన ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణమే ఉపశమనం కలిగించే వంటింటి చిట్కా ఒకటి ఉంది. మరి ఆ చిట్కా ఏంటో తెలుసుకుందామా..?
ఇదిగో చిట్కా
గొంతులో సమస్య ఉన్నప్పుడు ఒక పాత్రలో పావు లీటర్ నీళ్లు పోసి దాన్ని పొయ్యిమీద పెట్టాలి. ఆ నీళ్లలో చిన్న అల్లం ముక్క, రెండు యాలకులు, ఓ పదీ పన్నెండు తులసి ఆకులు, పావు స్పూన్ పసుపు వేసి బాగా మరిగించాలి. ఆ మరిగించిన నీటిని వడకట్టి తీయదనం కోసం ఒక స్పూన్ తేనె కలుపుకుని తాగాలి. అయితే మధుమేహం ఉన్నవాళ్లు మాత్రం తేనె కలుపకూడదు. ఈ చిట్కా గనుక పాటిస్తే క్షణాల్లోనే మీ సమస్య పరిష్కారమవుతుంది. తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiaNew vs Zealand | తొలి టెస్టులో సత్తా చాటిన భారత బౌలర్లు.. బుమ్రా ఖాతాలో మూడో వికెట్.. కివీస్ 95/5
Dia Mirza | ఆయనతో పనిచేయడం ఓ పీడకల..! దియా మీర్జా సంచలన వ్యాఖ్యలు
Sreeleela | అందుకే టాలీవుడ్‌కు దూరం..! క్లారిటీ ఇచ్చిన శ్రీలీల
Kamal Haasan| సేయాన్లో విరుమాండి గెటప్.. అతిథి పాత్రలో కనిపించనున్న కమల్‌హాసన్..!
Jain Diksha | కోట్లాది వ్యాపారాన్ని వదిలి సన్యాసం..! సూరత్‌లో ఓ కుటుంబం నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

