Deltacron | యూకేలో వెలుగులోకి కరోనా కొత్త వేరియంట్.. డెల్టా, ఒమిక్రాన్ కంటే వేగంగా వ్యాప్తి
Deltacron | ఒమిక్రాన్ రూపంలో వచ్చిన కొవిడ్-19 ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నది. రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఇక కరోనావైరస్ మామూలు పరిస్థితులు వస్తాయని అనుకుంటున్న తరుణంలో మరో షాకింగ్ వార్త బయటకొచ్చింది. యూకేలో మరో హైబ్రిడ్ స్ట్రెయిన్ వెలుగులోకి వచ్చింది. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల కలయికతో వచ్చిన ఈ కొత్త వేరియంట్ డెల్టాక్రాన్ ఇప్పుడు కలవరపెడుతున్నది. యూరప్ దేశమైన సైప్రస్‌లో ఈ కొత్త స్ట్రెయిన్‌ను గుర్తించినట్లు యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది.
వాస్తవానికి డెల్టాక్రాన్ వేరియంట్‌ను డిసెంబర్ చివరి వారంలోనే సైపస్ దేశానికి చెందిన పరిశోధకులు గుర్తించారు. ఆ సమయంలో డెల్టా, ఒమిక్రాన్ లక్షణాలు ఉన్న 25 కేసులు నమోదయ్యాయని పరిశోధకులు తెలిపారు. ఆ శాంపిల్స్‌ను జనవరి 7న జన్యు విశ్లేషణకు పంపించారు. అప్పుడు అందులో డెల్టా జన్యువులతో పాటు ఒమిక్రాన్ జన్యువులు కూడా కనిపించాయి. అయితే తొలుత దీన్ని ల్యాబ్ ఎర్రర్‌గా తోసిపుచ్చారు. కానీ ఆ తర్వాత పరీక్షల్లో హైబ్రిడ్ స్ట్రెయిన్‌గా నిర్ధారించారు. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల రీకాంబినేషన్తో ఈ కొత్త వేరియంట్ డెల్టాక్రాన్ ఏర్పడినట్లు స్పష్టమవుతోందని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ పేర్కొంది. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల జెనెటిక్ మెటీరియల్‌ను పరస్పర బదిలీ చేసుకోవడం ద్వారా ఈ వేరియంట్ ఏర్పడినట్లు తెలిపింది. గత వేరియంట్లతో పోలిస్తే ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే దీనిపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌ను అడ్డుకోగలదని యూకేకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- corona virus
- covid
- deltacron
- Health
RELATED ARTICLES
తాజా వార్తలు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

