KETO DIET: కీటో డైట్ తీసుకుంటున్నారా..? కొంచెం జాగ్రత్త
కీటో డైట్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ఆహారాల్లో ఒకటి. దీర్ఘకాలంలో వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జట్టు రాలిపోవడం, చర్మం పాలిపోవడం వంటివి...
కీటో డైట్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ఆహారాల్లో ఒకటి. శరీరం బరువు తగ్గించుకోవాలని ఉబలాట పడేవారు ఎక్కువగా కీటో డైట్‌ను ఫాలో అవుతుంటారు. ఈ డైట్లో అధిక కొవ్వు, ప్రోటీన్, చాలా తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారాన్ని తీసుకుంటారు. కార్బొహైడ్రేట్లు మన శరీరానికి కావలసిన శక్తి వనరులు. వీటిని తక్కువ స్థాయిలో అందించడం వల్ల దీర్ఘకాలంలో వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జట్టు రాలిపోవడం, చర్మం పాలిపోవడం వంటివి చూడవచ్చు.
మన శరీరం పనిచేయడానికి గ్లూకోజ్ అవసరం. ఈ గ్లూకోజ్ మనం తినే ఆహార పదార్థాల్లో ఉండే కార్బొహైడ్రేట్ల నుంచి లభిస్తుంది. ఫలితంగా శరీరానికి శక్తి లభిస్తుంది. అయితే, కోటో డైట్లో శరీరం గ్లూకోజ్‌ను కాకుండా కొవ్వును ఇంధనంగా ఉపయోగించుకుంటుంది. కీటో డైట్‌ని పాటించే వారు కొవ్వు ఎక్కువగా ఉండే మాంసం, చేపలు, నూనె పదార్థాలు, జున్ను, తక్కువ కార్బొహైడ్రేట్లు ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకుంటారు. కాగా, బ్రెడ్, పాస్తా, వరి అన్నం, ధాన్యాలు, పండ్లు, బంగాళాదుంప వంటి పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న వాటిని తక్కువగా తింటుంటారు.
ఇవీ దుష్ప్రభావాలు..
కీటో డైట్ ద్వారా బరువు తగ్గడం తాత్కాలికం. శరీరంపై ఒత్తిడి పడటంతో తక్షణమే బరువు తగ్గుతుంది. ప్రోటీన్, ఇతరత్రా అవసరమైన పోషకాలు అందకపోవడం వల్ల జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. కీటో డైట్ మన గట్ బ్యాక్టీరియాపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఈ ఆహారంలో అవసరమైన పోషకాలు ఉండవు. ఫలితంగా చర్మం దెబ్బతింటుంది. నేరుగా చర్మంపై దద్దుర్లు, ఇతర చర్మ సంబంధ సమస్యలకు కారణమవుతుంది.
సూక్ష్మ, స్థూల పోషకాలతోపాటు విటమిన్ల సాయంతో మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అదే కీటో డైట్‌ని అనుసరిస్తున్న వారిలో ఈ పోషకాల కొరత ఏర్పడుతుంది. ఈ ముఖ్యమైన పోషకాలు మెదడు, గుండె, కాలేయానికి అందాలి. అలాగే, చర్మం, జుట్టు పోషణకు అవసరం. పోషకాల లోపం మొదట చర్మం, గోర్లు, జుట్టుపైన కనిపిస్తుంది. బరువు తగ్గేందుకు కీటో డైట్‌ను ఫాలో అవడానికి ముందుగా ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీర్ఘకాలంపాలు ఈ డైట్‌ను ఫాలో అవడానికి ముందు దాని ప్రతికూలతలపై కూడా దృష్టి పెట్టాలి.
- శరీరానికి తగినంత శక్తి అందకపోవడం వల్ల తీవ్రమైన అలసట మనల్ని ఆవరిస్తుంది.
- ఈ విధానంలో బరువు తగ్గేవారు కొన్ని నెలల వ్యవధిలోనే తిరిగి పొందే అవకాశాలు ఉంటాయి.
- అధిక దాహానికి దారితీస్తుంది.
- మలబద్దకం సమస్యలు వస్తుంటాయి.
- మూత్రపిండాల సమస్యలు వేధిస్తాయి.
- గుండె సంబంధ వ్యాధులు తలెత్తే అవకాశాలు అధికంగా ఉంటాయి.
- ఈ డైట్‌ను కేవలం పోషకాహార నిపుణుల పర్యవేక్షణలోనే అమలు చేసుకోవడం చాలా ముఖ్యమైందని గుర్తుంచుకోవాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

