అలర్జిక్ రైనైటిస్.. బీ అలర్ట్
అలర్జిక్ రైనైటిస్ శ్వాస నాళాలను ప్రభావితం చేసే అలర్జీ వల్ల తలెత్తుతుంది. దీన్ని హే ఫీవర్ అని కూడా అంటారు.
అలర్జిక్ రైనైటిస్ శ్వాస నాళాలను ప్రభావితం చేసే అలర్జీ వల్ల తలెత్తుతుంది. దీన్ని హే ఫీవర్ అని కూడా అంటారు. గాలి ద్వారా సోకే పుప్పొడి రేణువులు, ధూళి క్రిములు (డస్ట్ మైట్స్), పెంపుడు జంతువుల బొచ్చు, పరిసరాల్లో ఉండే ఫంగస్ రేణువులు (మౌల్డ్ స్పోర్స్) మొదలైనవి మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ నుంచి వచ్చే ప్రతిస్పందనే అలర్జిక్ రైనైటిస్. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి అతి సాధారణంగా ఈ వ్యాధి సోకుతుంది.
అలర్జిక్ రైనైటిస్‌కు ప్రాథమిక కారణం మన శ్వాస వ్యవస్థ అలర్జెన్లకు గురికావడం. అలర్జీకి గురైనప్పుడు మన శరీరం వాటిని హానికరమైనవిగా గుర్తిస్తుంది. వాటితో పోరాటం చేయడానికి హిస్టమైన్ లాంటి రసాయనాలను విడుదల చేస్తుంది. అలా మన రోగ నిరోధక వ్యవస్థ చూపే ప్రతిస్పందన శ్వాస మార్గాల్లో మంటకు కారణమవుతుంది. దీంతో అలర్జిక్ రైనైటిస్ లక్షణాలుబయటపడతాయి.
అలర్జెన్లు ఇవి…
- చెట్లు, గడ్డి, కలుపు మొక్కల నుంచి వచ్చే పుప్పొడి రేణువులు.
- పరుపులు, కార్పెట్లు, కుర్చీలు, పరుపులు, సోఫాలు లాంటివాటిలో ఉండే డస్ట్ మైట్స్.
- పెంపుడు జంతువుల బొచ్చు, చర్మకణాలు, ఉమ్మి, మూత్రం.
- ఇంటా బయట ఉండే ఫంగస్ రేణువులు (మౌల్డ్ స్పోర్స్).
లక్షణాలు
- ముక్కుకారడం
- తుమ్ములు
- కండ్లలో దురద, నీరు కారడం
- ముక్కు రంధ్రాలు పూడుకుపోవడం
- గొంతు, చెవులు, నోటి పైభాగంలో దురదగా అనిపించడం
- దగ్గు
- అలసట
నిర్ధారణ – చికిత్స
అలర్జిక్ రైనైటిస్ లక్షణాలు గమనించగానే డాక్టర్‌ను సంప్రదించాలి. లక్షణాలను బట్టి ఆయన తగిన వైద్యాన్ని సూచిస్తాడు. ఇక అలర్జిక్ రైనైటిస్ బారినపడకుండా ఉండటానికి పుప్పొడి రేణువులు సోకే రుతువుల్లో ఇంటి కిటికీలు మూసి ఉంచాలి. ఎయిర్ ప్యూరిఫయర్లను వాడాలి. పరుపులు, కార్పెట్లను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

