High Blood Sugar | ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..? అయితే హై బ్లడ్ షుగర్‌గా అనుమానించాల్సిందే..!
High Blood Sugar | రక్తంలో చక్కెరలు ఎప్పుడూ పరిమిత మోతాదులో ఉండాలి. లేదంటే అది డయాబెటిస్‌గా మారుతుంది. బ్లడ్ గ్లూకోజ్ హెచ్చుతగ్గులు ఇతర అవయవాల పనితీరుపై ప్రభావం చూపిస్తాయి.
High Blood Sugar | రక్తంలో చక్కెరలు ఎప్పుడూ పరిమిత మోతాదులో ఉండాలి. లేదంటే అది డయాబెటిస్‌గా మారుతుంది. బ్లడ్ గ్లూకోజ్ హెచ్చుతగ్గులు ఇతర అవయవాల పనితీరుపై ప్రభావం చూపిస్తాయి. గుండె జబ్బులు, మూత్ర పిండాల సమస్యలు, స్ట్రోక్‌కు దారితీయవచ్చు. ఎప్పటికప్పుడు రక్త పరీక్ష ద్వారా బ్లడ్ షుగర్ స్థాయిలను తెలుసుకుంటూ ఉండాలి. ఆహారం తీసుకున్న 2 గంటల తర్వాత రక్తంలో గ్లూకోజ్ 180 ఉందంటే దాన్ని అధిక స్థాయిగా పరిగణించాలి. 100 – 125 మధ్య ఉంటే.. అంతకుముందు 8 గంటల నుంచి ఏమీ తినకపోతే అప్పుడు కూడా అధిక స్థాయిగానే పరిగణించాలి.
మధుమేహం రావడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ, వచ్చిన తర్వాత డయాబెటిస్ కు వెంటనే చికిత్స అవసరం. లేదంటే రక్తనాళాలు దెబ్బతిని ప్రాణాపాయంగా మారతాయి. హై బ్లడ్ గ్లూకోజ్ ఉన్నట్టు కొందరికి తెలియదు. కొన్ని సంకేతాలు కనిపిస్తున్నా.. వాటిని మధుమేహ లక్షణాలుగా అర్థం చేసుకోరు. కొత్తగా మధుమేహం బారిన పడినవారే కాకుండా, ఈ సమస్య ఉండి నియంత్రణలో లేని వారికి సైతం ఇదే మాదిరి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటే హై బ్లడ్ షుగర్‌గా అనుమానించి తగు చికిత్స తీసుకోవాలి.
అలసట..
రక్తంలో గ్లూకోజ్ అధికంగా ఉన్నప్పటికీ శరీరం శక్తిగా మార్చుకోలేని స్థితిలో ఉంటుంది. దాంతో శక్తి చాలక అలసట అనిపిస్తుంది.
మూత్ర విసర్జన
మూత్ర పిండాలు రక్తంలోని షుగర్‌ను వడ కట్టలేవు. కానీ, గ్లూకోజ్‌ను బయటకు పంపించే ప్రయత్నం జరుగుతుంది. దీంతో తరచూ మూత్ర విసర్జన అవసరం పడుతుంది.
అధిక దాహం
అధిక మొత్తంలో గ్లూకోజ్ కండరాలకు చేరినప్పుడు శరీరం డీహైడ్రేట్ అయి దాహం వేస్తుది. దాంతో మనం ఎక్కువగా నీరు తాగుతుంటాం.
బరువు తగ్గడం
రక్తంలో అధికంగా గ్లూకోజ్ ఉన్నా ఇన్సులిన్ లేమి కారణంగా దాన్ని శరీరం ఉపయోగించుకోలేదు. దీనికి బదులు స్టోర్‌లోని కొవ్వులను వాడుకుంటుంది. ఫలితంగా శరీరం బరువు కోల్పోతారు. దీనిని ఏమాత్రం అశ్రద్ద చేయకూడదు.
తీపి వాసన మూత్రం
ఎవరిలోనైనా మూత్రం తీపి వాసనగా వస్తుందంటే రక్తంలో చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉన్నదని అనుమానించాలి. రక్తంలోని చక్కెరలు రక్తం నుంచి మూత్రపిండాల ద్వారా మూత్రం రూపంలో బయటకు పోతూ తీపి వాసనను ఇస్తుంది.
కంటి చూపు
రక్తంలో గ్లూకోజు పెరగటం వల్ల కంటి వెనుక భాగంలో రక్తనాళాల పరిమాణం పెరుగుతుంది. ఇదే కంటి చూపు తగ్గిపోయేందుకు దారితీస్తుందని గుర్తించాలి. అస్పష్టమైన దృష్టిని కలిగి ఉన్నారంటే రక్తంలో అధిక చక్కెరకు సంకేతం కావచ్చు.
తిమ్మిర్లు, జలదరింపులు
రక్తంలో గ్లూకోజ్ అధిక స్థాయిల్లో ఉంటే అది రక్తనాళాలు దెబ్బతినేందుకు దారితీస్తుందని వైద్యులు చెప్తుంటారు. రక్తప్రవాహానికి కూడా అడ్డంకులు ఏర్పడతాయి. ఫలితంగా తిమ్మిర్లు, జలదరింపు వస్తుంటాయి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

