కవుల గళం దోపిడీకి కళ్లెం.. గోదావరి కన్ను పొడువకండి
ధర్మానికి దారులెక్కడివి న్యాయానికి చూపెక్కడిది ఆది నుండి వక్రగీతాలే ఆస్తులు అంతస్తులు అధికారాలు కబళించినట్లే
ధర్మానికి దారులెక్కడివి
న్యాయానికి చూపెక్కడిది
ఆది నుండి వక్రగీతాలే
ఆస్తులు అంతస్తులు అధికారాలు కబళించినట్లే
దోపిడికి ప్రతినిధులు
నీళ్లను దోచుకున్నారు
మళ్లీ ఇప్పుడు
గోదావరిపై పాత పాటలే రోత మాటలే
కుట్రలకు ఎర్రతివాచీలు
మా పొయ్యి మేము పెట్టుకున్నా
మా గిన్నెల్లో ఎసరుకు మిమ్మల్నే నీళ్లడగాలా?
ఇక్కడ చెరువులు, కుంటలు
పొలాలు పక్షులు ఆకలి గీతాలు పాడాలా?
నవీన యుగంలో కూడా
అన్యాయాన్ని పరిష్కరించే ట్రిబ్యునల్
చట్టాలెవరి కాళ్లకు ప్రణమిల్లాయో? ఎవరికెరుక
అరటాకుల గోస అరటిదే
మామిడి ఆకుల గోస మామిడిదే
తల్లి కడుపులో తలపెట్టి చూస్తే తెలుస్తది
అమ్మ వ్యథ
గోదావరిని మళ్లించుకునే తాపత్రయాలు
ఏ బడిలో చదువుకున్నా గురువెవరైనా
చదివించింది మన అమ్మనే
చర్చల్లేవు చర్చించుకోవడాలు లేవు
ఎవరి దయా దానాలక్కరలేదు
కాళ్లు దారి తప్పినా
మనసు మనింటి కడప మీదనే ఉండాలి
మనసు మతి తప్పినా ఎద ఇంట్లోనే ఉండాలి
తరతరాల కరువు తండ్లాట
అస్తిత్వ ఆవేదన
మా కన్నీళ్లను వేన్నీళ్ళుగా మార్చుకునే బరితెగింపు
మా నీళ్లు మాకే మీ నీళ్లు మీకే
పొలాల కాళ్లు తడవాలి
పక్షుల ముక్కులద్దాలి
పశువుల తోకలు నీళ్లల్ల లొట్కుగొట్టాలి
ఒక్కటీ భరోసా లేదు
రెండేండ్ల కాలంలో నీళ్లాదెరువు
నిప్పులు మీద పోసుకున్నట్టే
నాయనలారా!
నాలుకలెన్ని మడతలైనా తిప్పండి
నీళ్లు నిలబడే ఆలోచనలకు తలుపులు తెరువండి
వలసలకు నెలవీయకండి
నీళ్లే బతుకు జలదారలు
గోదావరి కన్ను పొడువకండి
పొలాల పొట్ట కొట్టకండి
బ్రతుకు పాటలకు డప్పులు సరిచేయండి…
వనపట్ల సుబ్బయ్య
94927 65358
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

