తిన్నింటి వాసాలు
లెక్కవెడుతున్నరు! అగో ! తిన్న ఇంటి వాసాలు లెక్కవెట్టుడు మొదలైంది! అలసిన బాటసారి ఆకలాకలి అని అంటే ఇంటి తలుపు తీసి కాళ్లకు నీళ్లిచ్చి పిలిచి పీటేసి మంచిగ పచ్చని మోతుకాకుల మక్క గట్క పెట్టి దయాపామురంతోని అరుసుకుంటిమి! తెల్లవారి లేచి పొమ్మంటే మర్ల వడుతున్నడు
లెక్కవెడుతున్నరు!
అగో ! తిన్న ఇంటి వాసాలు
లెక్కవెట్టుడు మొదలైంది!
అలసిన బాటసారి
ఆకలాకలి అని అంటే ఇంటి తలుపు తీసి
కాళ్లకు నీళ్లిచ్చి
పిలిచి పీటేసి
మంచిగ పచ్చని మోతుకాకుల మక్క గట్క పెట్టి
దయాపామురంతోని అరుసుకుంటిమి!
తెల్లవారి లేచి పొమ్మంటే
మర్ల వడుతున్నడు
గిదే రానిచ్చుడే తప్పైంది మల్లా !
తిండి పెట్టుడు ఇంకా తప్పైంది
రాత్రంతా నిద్రవోక
బాటసారి మన ఇంటి వాసాలు లెక్కవెట్టి
బాజాప్తా ఇల్లు నాదే అంటున్నడు !
రానిచ్చుడు తప్పైంది
తిండి పెట్టుడు ఇంకా తప్పైంది
శాసనాల్లెక్క గోడలకు
తాత ముత్తాతల ఫొటోలు
వరుసగున్నాయి మొగులునించి దిగచ్చినట్టు!
లోకమంతా ఇల్లు మనదే అంటున్నడు
లల్లాయి పదాలు పడేటోల్లయి
రంగు బట్టలేసుకుని బాగోతాలు ఏసేటోల్లయి
బొమ్మలు పెట్టుకుంట షాన్ పోతున్నరు
చరిత్ర లేదని వంకర టింకర మాట్లాడుతున్నారు
తిన్న ఇంటి వాసాలు లెక్కవెట్టేటోళ్ల
చూపుడు వేలు ఇరిచేస్తే బుద్ధి అస్తది
ఇసంటోళను నమ్మరాదు
కట్టెవట్టుకొని కాగడాలు వట్టుకొని
కంటి మీద కునుకు లేక
గస్తీ తిరుగాలే !!
పహరా హుషార్!!
– కందాళై రాఘవాచార్య 8790593638
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | రైళ్ల నుంచి దింపివేత, ఇండ్లకెళ్లి అరెస్టులు.. పోలీసుల నిర్బంధంలో వేలాది మంది యువజనులు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

