పాటల జెండాకు వందనాలు
బాలసంతుల శంఖు శబ్దం తంబురా బుర్రల వడిసెల నాదం డిల్లంబల్లెం డమరుక గానం జమిడికెల పలుకు మర్ఫా తీన్మార్ కోలాటాల వెన్నెల కోల్ జెజ్జెన్క జెన్ అరుణారుణ సవ్వడి
(ప్రజా గాయకులు సాయిచంద్ స్మృతిలో)
బాలసంతుల శంఖు శబ్దం
తంబురా బుర్రల వడిసెల నాదం
డిల్లంబల్లెం డమరుక గానం
జమిడికెల పలుకు మర్ఫా తీన్మార్
కోలాటాల వెన్నెల కోల్
జెజ్జెన్క జెన్ అరుణారుణ సవ్వడి
ఏ సెలయేరులో ఆ స్వరముంటది
ఏ కోయిల గొంతులో ఆ మాధుర్యముంటది
ఏ చెరువు అలుగు దారలో ఆ జడి ఉంటది
ఏ అగ్నిజ్వాలలో ఆ సెగుంటది
అస్తిత్వ ఉద్యమానికి
వెన్నెముకై విప్లవాగ్నిని రగిలించాడు
గొంతును ప్రవాహంచేసి
మట్టిని పాటల జెండాగా ఎగరేశాడు
దశాబ్దాల స్వప్నాన్ని జనం కండ్లల్లో
ఆవిష్కరించాడు
గోదావరంత ధూంధాం
పాలమూరు స్వేదస్వరం
తెలంగాణ ఉద్యమ గీతం
అమరుడా…
నీవులేని పాటలేదు
పాటలేని తెలంగాణ లేదు
రాగం పరవశించని గుండెలేదు
దరువు దుంకని వేదిక లేదు
సీటీగొట్టని సభలేదు
ఆత్మగౌరవ బావుటాని కాగడాలా
వెలిగించిన జనజాగృతి పాట
రాతిబొమ్మల్ని కరిగించి
కదిలించిన అమరుల గాత్రం
పాటకు పర్యాయపదమైన మట్టి గంధం
తెలంగాణ తల్లి చిన్నబోయింది
సప్తవర్ణ సింగిడి ఇచ్చుకపోయింది
పల్లె ఇండ్లల్ల అల్కు మాసినట్టుంది
పసుపు గంధం చెదిరిపోయినట్టుంది
సూర్యుడిని మొలిపించిన పాట
లక్షల జనాన్ని నిలబెట్టిన పాట
నిద్ర గూడులో పక్షులు
ఒక్కసారిగా నిద్రలేచాయి
తెల్లవారంగా మసకనిలిచిన కళ్లకు
రంగు వెలిసిపోయిన వార్త
మెరుపు మేఘం రాలిన దుఃఖం
పాలమూరు చెమట తడి
ఆత్మకూరు ఆర్తి
తెలంగాణ ఉద్యమానికి గుండెనిచ్చిన
పాటల జెండాకు వందనాలు
పువ్వుకు మరణము లేదు
ప్రతి పువ్వులో నీ పరిమళమే
పాటకు చావులేదు
ప్రతిపాటలో నీ ఆశయమే
నదికి అంతర్ధానం లేదు
ప్రతి అలలో నీరూపమే
పాట తొలి పొద్దుపొడుపు
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

