అమెరికా బరిలో ముదివగ్గులే
అమెరికా ఎన్నికల బరిలో మరోసారి ముదివగ్గులే నిలిచారు. అగ్రరాజ్య పీఠాన్ని యువతరం, మహిళలు అధిరోహించే అవకాశం మరోసారి చేజారింది. ప్రపంచదేశాల్లో యువత, మహిళా నేతల హవా నడుస్తుంటే.. అందుకు భిన్నంగా అగ్రరాజ్యం ఎన్నికలు జరుగుతుండటం చర్చనీయాంశం.
అమెరికా ఎన్నికల బరిలో మరోసారి ముదివగ్గులే నిలిచారు. అగ్రరాజ్య పీఠాన్ని యువతరం, మహిళలు అధిరోహించే అవకాశం మరోసారి చేజారింది. ప్రపంచదేశాల్లో యువత, మహిళా నేతల హవా నడుస్తుంటే.. అందుకు భిన్నంగా అగ్రరాజ్యం ఎన్నికలు జరుగుతుండటం చర్చనీయాంశం.
అమెరికా అధ్యక్ష ఎన్నికలను యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తూ ఉంటుంది. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం తదితర అంశాలే అందుకు కారణం. అమెరికా తీసుకునే నిర్ణయాల ప్రభావం ప్రపంచ దేశాలపై ఉంటుందనడంలో సందేహం లేదు. పరోక్షంగా ప్రపంచ దేశాలను అగ్రరాజ్యం శాసిస్తుంటుంది. అటువంటి దేశ అత్యున్నత పీఠాన్ని ఈసారైనా యువత, మహిళల్లో ఎవరైనా అధిరోహిస్తారా? అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొన్నది. కానీ, ఈసారి కూడా ఊరించి ఉసూరుమనిపించారు పోటీలో నిలిచిన పలువురు ప్రముఖులు.
ఇటీవల ముగిసిన సూపర్ ట్యూజ్డేతో ప్రధాన పార్టీలైన రిపబ్లికన్, డెమొక్రాటిక్ల తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఎవరనేది తేలిపోయింది. ప్రైమరీ ఎన్నికల్లో మొదటి నుంచి ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్న జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రత్యర్థులుగా బరిలో నిలవడం ఖాయమైపోయింది. డెమొక్రాటిక్ అభ్యర్థిత్వానికి మొదటి నుంచే పెద్దగా పోటీ లేదు. కానీ, రిపబ్లికన్ పార్టీ తరఫున కదన రంగంలోకి దిగేందుకు పలువురు చివరి వరకు ప్రయత్నించారు. వారిలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామితో పాటు నిక్కీ హేలీ కూడా ఉండటం విశేషం. అయితే వివేక్ రామస్వామి కాస్త ముందుగానే తప్పుకోగా, నిక్కీ హేలీ మాత్రం చివరి వరకు పోరాడారు. ట్రంప్‌కు పోటీ ఇచ్చిన ఆమె సూపర్ ట్యూజ్డేకు ఒకరోజు ముందుగా పోటీ నుంచి తప్పుకొన్నారు. ఇక డెమొక్రాటిక్ పార్టీ నుంచి మరోసారి బైడెన్ పోటీలో ఉండటం ఖాయమైపోయింది. అమెరికాలో భారత సంతతి ప్రాబల్యం పెరుగుతుండటంతో ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్‌కే మళ్లీ అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధికార పీఠాన్ని అధిరోహించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. నాలుగు వేర్వేరు కేసుల్లో నేరారోపణలను ఎదుర్కొంటున్న ఆయన కోర్టు అనుమతితో మరోసారి బరిలో నిలిచారు. అయినప్పటికీ రాయిటర్స్ తదితర సంస్థల సర్వేల్లో ట్రంప్ తన ప్రత్యర్థుల కంటే ఎక్కువ పాపులర్ రేటింగ్ సాధించారు. తన శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటానని బహిరంగంగా ప్రమాణం చేస్తున్న ట్రంప్.. మరోసారి పోటీలో నిలవడం వైచిత్రిగానే చెప్పుకోవాలి.
ట్రంప్ ప్రత్యర్థి బైడెన్ అనేక ప్రతికూలతలను ఎదుర్కొంటున్నారు. ఆయనకు మతిమరుపు ఉన్నదనే ఆరోపణ ఎప్పటి నుంచో ఉన్నది. అదీకాకుండా వయోభారం కారణంగా బైడెన్ మరో నాలుగేండ్లు పాలించగలరా? అనే సందేహాలు అమెరికన్లలో కలుగుతున్నాయి. ఓవైపు వయస్సు అడ్డువస్తుండగా.. మరోవైపు పేలవమైన పాపులర్ రేటింగ్ బైడెన్‌ను వెంటాడుతున్నప్పటికీ ఆయన మరోసారి అధ్యక్ష బరిలో నిలవడం గమనార్హం. మరో నాలుగేండ్లు పాలించే సత్తా తనకు ఉందని ప్రజలను ఒప్పించేందుకు ఆయన సర్వశక్తులను ఒడ్డుతున్నారు. ఇటీవల విడుదలైన రాయిటర్స్ పోల్‌లో 35 శాతం మంది బైడెన్‌కు మద్దతుగా నిలిచారు. అయితే రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ పరిణామాలు బైడెన్‌కు ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాజాలో 25 వేల మందికి పైగా ప్రజలు మరణించడంతో సొంత పార్టీ నేతల నుంచే ఆయన విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అమెరికా ఇమిగ్రేషన్ పాలసీపై కూడా విమర్శలున్నాయి.
ఏదేమైనప్పటికీ వయసు మీదపడ్డ నేతలే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి ప్రత్యర్థులుగా మారడం విచిత్రం. వయోభారంతో ఇబ్బందులు పడుతున్న వీరిపై అమెరికాలోని మెజారిటీ వర్గం ఆసక్తి చూపడం లేదన్నది కఠోర సత్యం. వివిధ సర్వేల్లో వారికి వచ్చిన పాపులర్ రేటింగ్స్ అందుకు నిదర్శనం. అయితే అమెరికన్లకు ఇష్టం ఉన్నా, లేకున్నా మరోసారి ముదివగ్గులైన పాలకులనే ఎన్నుకోక తప్పదు.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

