గుండె జెండాలా ఎగురుతున్నది!
ఒక నక్షత్రం నేల రాలగానే అమ్మలా దేహాన్ని చుట్టుకుంటుంది, ఒక విజేత వేదికపై నిలవగానే భుజాలనెక్కి వెన్ను తడుతుంది, ఒక పిడికిలి పైకెత్తగానే ఉత్సాహంతో ఉరకలు వేస్తుంది!
ఒక నక్షత్రం నేల రాలగానే
అమ్మలా దేహాన్ని చుట్టుకుంటుంది,
ఒక విజేత వేదికపై నిలవగానే
భుజాలనెక్కి వెన్ను తడుతుంది,
ఒక పిడికిలి పైకెత్తగానే
ఉత్సాహంతో ఉరకలు వేస్తుంది!
గాలికి ఎగిరేదని తేలిగ్గా తీసుకోకు
జాతిని ఒక్క తాటిపై నడిపించింది,
చేతిలో విరిగేదని చులకనగా చూడకు
శత్రువుల గుండెలను హడలగొట్టింది!
ఎన్ని రక్తపు చుక్కల త్యాగమో
ఎన్ని పోరాటాల ఫలమో
ఎన్ని గుండెల చప్పుడో
ఎన్ని సంకెళ్ళ తెగదెంపులో…
కాషాయపు ఎజెండా కాదిది,
కరిమబ్బులను చీల్చుకు వచ్చిన
కాంతికిరణం మన జెండా,
వజ్రోత్సవ గీతానికి
మూలస్తంభం మన జెండా!
ఎవడైనా జెండా ముందు తల వంచాల్సిందే
ఎవడైనా జెండాను తలెత్తి చూడాల్సిందే,
కాదని పొగరు చూపినవాడు
అమ్మను చీదరించుకున్నట్లే!
పిల్లలంతా జెండాలు పట్టుకొని
ఊరంతా కవాతు చేస్తుంటే
ఆనాటి స్వాతంత్య్ర పోరాటం
కళ్ళముందు సాక్షాత్కరిస్తున్నది,
వాడవాడలా ఎగురుతున్న జెండాల్లో
అమరవీరుల చిరునవ్వులు ప్రతిబింబిస్తున్నాయి!
ఇప్పుడు…
ప్రతి గుండె జెండాలా ఎగురుతున్నది
దేశమంతా ఒకే జెండాయై కదులుతున్నది!
– పుట్టి గిరిధర్, 9491493170
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

