కోటి జెండాల నేల
ఇంటింటా నెత్తిమీద బోనంలా
తెలంగాణ జెండా ఎత్తుకుంది
గుండె నిండా దేశభక్తి నింపుకుని
చెట్టు పుట్టా అంతా
మూడురంగులు చుట్టుకుని
నేలనంతా స్వాతంత్య్ర పండుగను పరిచింది
ఇక్కడ
రంగులు అన్నీ కలపబడతాయి
భుజాలు బేషరతుగా అందించబడతాయి
హృదయాలు పెనవేసుకొని బతుకుతాయి
ఈ చోటు
స్వేచ్ఛ సుస్వాగతం పలుకుతుంది
అభివృద్ధి అందరి హక్కుల హక్కుగా
మనసులు ప్రగతికి హారతి పడతాయి
తెలంగాణ ఎప్పుడూ
జాతీయ భావం పులకించే క్షేత్రం
దేశ భవిష్యత్తు కోసం త్యాగానికి సదా సిద్ధం
కోటి జెండాలను ఎగరవేసి
ప్రతి మనిషిలో దేశ భక్తిని కదిలించి
మది మదిలో గాంధీ భావాల్ని నింపింది
దాసరి మోహన్
99853 09080
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
- Tags
- kavithalu
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

