బొడ్రాయి
చెరువులు, కుంటలు, అలుగులు దుంకే ప్రవాహాల హోరు తీరొక్క పంటల తీన్మార్ పునర్నిర్మాణంలో పూలతేరులు ఊరూరా బొడ్రాయి పండుగలు ఊరుకు తొలి దేవత/ముఖచిత్రం బొడ్రాయి!
చెరువులు, కుంటలు,
అలుగులు దుంకే ప్రవాహాల హోరు
తీరొక్క పంటల తీన్మార్
పునర్నిర్మాణంలో పూలతేరులు
ఊరూరా బొడ్రాయి పండుగలు
ఊరుకు తొలి దేవత/ముఖచిత్రం బొడ్రాయి!
ఊరు బొమ్మ గీసుకోకముందు
ఊరుని పొందిచ్చేముందు
బొడ్డురాయి ప్రతిష్ట
తొలి దేవత ఆమే, ఊరికి అమ్మదేవత
పెళ్ళిండ్లు, పండుగలు, ప్రారంభాలకు
ఆడబిడ్డ ఊరు దాటేటప్పుడు,
కొత్త కోడలు వచ్చేటప్పుడు,
సారె పెట్టినప్పుడు, సంబురమేదైనా
తొలి మొక్కు బొడ్రాయికే
అమ్మతల్లి ప్రతిరూపం బొడ్రాయి
సరిహద్దులు లేని తల్లి
సంకుచితాలు తెల్వని తల్లి
గుడి గోపురాలు అడుగని తల్లి
నగలు, వడ్డాణాలు లేని తల్లి
కట్టుబట్టలు లేకుండా
ఎండకు ఎండి వానకు తడిసి
ఎవరి ఆధీనంలో ఎవరి నీడలో లేకుండా
ఎల్లవేళలా ఎల్లప్పుడూ కాపాడే
చల్లని దీవెనలిచ్చే తల్లి బొడ్రాయి
ఆర్భాటాలు హంగామాలు లేవు
పసుపు కుంకుమ బండారుతో పటమేస్తే సాలు
కల్లుసాక పోస్తే సాలు
గుగ్గిళ్లు కుడుములు కుంభం పోస్తే సాలు
పొలిమమేరల పొలిచల్లి పొత్తిలి చుడితే సాలు
ఏ హారాలు అడుగని ఏ కోరికలు లేని
బొడ్రాయి ఊరికే దేవత
ప్రకృతి ప్రతిమనే దైవం
ఆపదొచ్చినా అనారోగ్యమొచ్చినా
అమ్మదేవతలను కొలిచే మాతృస్వామ్య వ్యవస్థ
అమ్మతల్లి, తట్టుపోసినా గత్తరలొచ్చినా
కరువులు, కాటకాలొచ్చినా
అనాది నుంచి నేటికీ అమ్మదేవతకు పండుగ
నలుగురు కలిసే…. నడిచే బాటలో
పాలకొమ్మలా నవ్వే తల్లి బొడ్రాయి
తెలంగాణ రాష్ట్రం ఆవిర్బావం
ప్రతి ఊరు పునర్నిర్మాణం
జిల్లాలు మండలాలు సుపరిపాలన
గాదెలు గుమ్ముల నిండా ధాన్యం
భూములు బంగారాలు
వెన్నెల రాసిలా బంధువుల ముచ్చట్లు
ఆత్మీయ కలయిక అనుబంధాల సమ్మేళనం
గడపగడప ఖుషీగా
ఊరుమ్మడి సామూహిక సామాజిక పండుగ
జగ్గుజగ్గున జమిడిక మెరుపులు
కాళ్లకు గజ్జెలు కథ చెప్పె దరువుల పలకలు
తప్పెట్ల దరువులు బైండ్ల ఆటలు పాటలు
బొడ్రాయికి బోనాలు కోటమైసమ్మ
పోచమ్మ లింగమయ్యకు బోనాలు
ఏరుతెగినట్లు ఊరంత జనజాతర
నదిపరివాహక ప్రాంతం
రాళ్లు గుట్టలు, నట్టు చెట్టు పుట్ట ప్రతిదీ దైవం
జానపదుల నమ్మకం ఆనందాల విశ్వాసాలు
దూరతీరాల్లో ఉన్నా పక్షులోలే వాల్తరు
రంగురంగుల కొత్త బట్టలతో కోలాటాల సింగిడి
పండుగలేవైనా మళ్ళీమళ్లీ చూస్తాం.. చేస్తాం
బొడ్రాయి పండుగ చూసే అవకాశం
ఎన్నో యుగాల జన్మఫలం
మోదుగుపూలు పూసిన వసంత పున్నమిలా
బొడ్రాయి పండుగలో మా ఊరు
వనపట్ల సుబ్బయ్య: 9492765358
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

