కృత్రిమ మేధస్సు-రేపటి తరానికి ముప్పు!
కోడింగ్ రాసిన కావ్యాల లోపల జ్ఞానపు లోతులు తరిగిపోయే
కోడింగ్ రాసిన కావ్యాల లోపల
జ్ఞానపు లోతులు తరిగిపోయే
కంటిపాపల స్వచ్ఛమైన సృజనను
సిలికాన్ చిప్పులు మింగేసే!
అక్షరాల వెనుక ఆత్మ లేదు
మెదడు నాడులు మొద్దుబారే
కంప్యూటర్ స్క్రీన్ల వెలుతురులో
నిజమైన మేధస్సు మంటకలిసే!
ప్రాణం లేని అల్గోరిథం వలలో
యువతరం ఆలోచన చిక్కుకుపోయే
పలకా బలపం పక్కన పడేసి
యంత్రాలకే బానిసగా మారే!
సహజమైన ఊహల లోకాన్ని
డిజిటల్ మాయాజాలం శాసించే
రెప్పల చాటున దాగిన ఆశలు
డేటా సర్వర్లలో బందీ ఆయే!
మనుషుల నడుమ బంధాలన్నీ
వర్చువల్ నీడలుగా మారిపోయే
ఈ రోబోల సామ్రాజ్యపు వేగంలో
మానవ మనుగడే శూన్యమయ్యే!
యంత్రం మనకు సేవకుడే కానీ
సృష్టిని శాసించే శక్తి కాకూడదు
మానవ సంకల్పపు వెలుగుల ముందర
సాంకేతిక ముప్పు ఎప్పుడూ గెలవలేదు!
-జాటావత్ రాజు, 9347196264
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

