మాండలికపు పాట
జాతి గర్వించే సాహితీ దిగ్గజం తెలంగాణ. జ్ఞానపీఠం డాక్టర్ సినారె కలం నుంచి వచ్చిన పాటలన్నీ ఆణిముత్యాలే. అలాంటి పాటల్లో ముప్పై ఏండ్ల కిందట ఆయన ‘మొరటోడు నా మొగుడు’ సినిమా కోసం రాసిన కోయిలాల పాటలో మాండలిక మాధుర్య గొప్పతనం వినిపిస్తుంది.
జాతి గర్వించే సాహితీ దిగ్గజం తెలంగాణ. జ్ఞానపీఠం డాక్టర్ సినారె కలం నుంచి వచ్చిన పాటలన్నీ ఆణిముత్యాలే. అలాంటి పాటల్లో ముప్పై ఏండ్ల కిందట ఆయన ‘మొరటోడు నా మొగుడు’ సినిమా కోసం రాసిన కోయిలాల పాటలో మాండలిక మాధుర్య గొప్పతనం వినిపిస్తుంది. భర్త గొప్ప మనసు తెలుసుకోలేక భార్య అతన్ని అపార్థం చేసుకుంటుంది. అతని మంచితనం తెలిశాక అతని రాకకోసం ముస్తాబై ఎదురుచూస్తూ కోయిలమ్మతో తన మనోగతం పంచుకుంటున్న సందర్భంలో సినారె ఈ పాట రాశారు.
కోయిలాల ఓ కమ్మటి కబురిన వేల/ సల్లటేల ఆ సంగతి సెవినెయ్యాల /ఆలకిస్తే నమ్మలేవులే/అమ్మతోడు కల్లకాదులే /గుండెలో నిండే ఇంత సంతోషం/ఉండలేనందే ఇనిపో కొంచెం.. ఇలా సాగుతుంది పాట.
భార్యాభర్తల మధ్య అన్యోన్యతను ఈపాట చక్కగా వివరిస్తుంది. ఉడుకు నీళ్లు, సలువ పంచె, తానమాడు లాంటి పదాలు తెలంగాణ గ్రామీణ సంస్కృతికి అద్దం పడుతాయి. పాటలో ఒకచోట భర్త కోసం భార్య వీధిగడపై సూడనా అని అంటుంది. భార్యాభర్తల అనుబంధాన్ని ఇంతకంటే మిన్నగా ఎవరైనా నిర్వచించగలరా? మాటలోనే పెళుసంట, మనసు యెన్నపూసంట లాంటి పంక్తులతో పాటను అల్లడం సినారెకు మాత్రమే చెల్లింది. సల్లటేల, యాళ లాంటి సమయ సూచిక పదాలు, కూడు (అన్నం) అరగించు (తిను) యాడో (ఎక్కడ) దడుసుకుని (భయ పడి) ఇనిపో (వినివెళ్ళు) లాంటి పదాలతో పాటను ఆసక్తికరంగా మలిచారు. సినారె సాహిత్యానికి, ఇళయరాజా సంగీతం తోడైన ఈ కోయిలాల పాట అప్పటికి, ఇప్పటికి మాధుర్య మణిభూషణమే. అటు సాహితీలోకాన్ని, ఇటు ప్రేక్షక గణాన్ని పరవశింపజేసిన ఈ గీతం సినారె తెలుగువారికి అందించిన ఒక ఆణిముత్యం.
– దుర్గమ్ భైతి 99590 07914
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

