తక్కువ ధరకే బంగారం అంటూ మోసాలు- ఇద్దరు కేటుగాళ్ల అరెస్టు



నిందితుడు నాగర్జునరెడ్డి
రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… ఏపీ రాష్ట్రం కడపకు చెందిన అవ్వారు సుధాకర్ (33), శంషాబాద్ నివాసి నాగర్జున రెడ్డి అలియాస్ సుధీర్ కుమార్ కొంత కాలం కిందట పరిచయం అయ్యారు. పదవతరగతి చదివిన సుధాకర్ కులవృత్తి అయిన నేతవృత్తిలో రాణించలేకపోయాడు. సునయాసంగా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ది మొదలైంది. ఎయిర్‌పోర్టులో తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని కడపకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని నమ్మించి రూ. 6 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత గొడవ జరిగి తిరిగి ఇచ్చేశాడు. అనంతరం 5 నెలల కిందట రమణ అనే వ్యక్తి ద్వార విజయవాడకు చెందిన నండూరి రాం ప్రసాద్ తో పరిచయం ఏర్పడింది. ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ విభాగం లో మేనేజర్‌గా పనిచేసే నాగర్జున రెడ్డి అలియాస్ సుధీర్ కుమార్ ని సుధాకర్ రాం ప్రసాద్‌కు పరిచయం చేశారు. తనకు ఎయిర్‌పోర్టులో చాలా దేశాల నుంచి వచ్చేవారు బంగారం తెస్తారని, అధికారులు పట్టుకొని సీజ్ చేసిన బంగారం తక్కువ ధరకే అమ్ముతారని , తనకు వారు తెలుసని మాయమాటలు చెప్పాడు. రూ. 32 లక్షలకు కిలో బంగారం ఇప్పిస్తామని నమ్మించారు. వారి మాటలు నమ్మి రాం ప్రసాద్ గత నెల 19 న 32 లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత ఇద్దరి ఆచూకి లేదు. బంగారం లేదు. మోసపోయానని గ్రహించిన రాం ప్రసాద్ శంషాబాద్ ఆర్జిఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉదయం నిందితుడు సుధాకర్‌ను పోలీసులు శంషాబాద్ బస్టాండ్‌వద్ద కడప వెళ్లేందుకు నిలుచుండగా అరెస్టు చేసి విచారించారు. నేరం ఒప్పు కున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ. 25,20, 000 నగదు, 4 తులాల బంగారం సీజ్ చేశారు. కొత్త వ్యక్తుల మాయమాటలు నమ్మి దురాశ తో మోస పోవద్దని డీసీపీ పేర్కొన్నారు. చాకచక్యంగా కేసు దర్యాప్తు చేసిన పోలీసు బృందాన్ని అభినందించారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

