Parveta Utsavam | తిరుమలలో ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం
Parveta Utsavam | తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల మరుసటిరోజు నిర్వహించే సంప్రదాయ పార్వేట ఉత్సవం బుధవారం ఘనంగా జరిగింది.
తిరుమల : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ( Navaratri Brahmotsavams ) మరుసటిరోజు నిర్వహించే సంప్రదాయ పార్వేట ఉత్సవం ( Parvetai Utsavam ) బుధవారం ఘనంగా జరిగింది. సాధారణంగా మకర సంక్రాంతి మరుసటిరోజైన కనుమ పండుగనాడు నిర్వహించే ఈ ఉత్సవాన్ని, అధికమాసం కారణంగా నిర్వహించిన నవరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

తిరుమలలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో, శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధన పూర్తయిన అనంతరం శ్రీమలయప్పస్వామివారిని తిరుచ్చిపై ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి తీసుకొచ్చారు. స్వామివారికి ఆరాధన, నివేదన, హారతి సమర్పించారు. పార్వేట ఉత్సవంలో భాగంగా శ్రీమలయప్పస్వామివారి తరఫున అర్చకులు బాణం సంధించి కొంతదూరం ముందుకు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చారు. ఈ ప్రక్రియను మూడుసార్లు నిర్వహించారు. దుష్టశక్తులను శిక్షించి, భక్తులను రక్షించడమే పార్వేట ఉత్సవంలోని అంతరార్థమని అర్చకులు వెల్లడించారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parveta Utsavam | తిరుమలలో ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం
Scene | ‘సీన్’ ప్రమోషన్స్ టైం.. సూర్య టీం ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేసిందో తెలుసా..?
Shashi Tharoor | ‘నన్నడిగితే ఎలా.. నేనేం ట్రావెల్ ఏజంట్‌ను కాదు’.. రాహుల్‌గాంధీ ఫారిన్ టూర్‌పై శశిథరూర్..!
అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి
Obesity | 2050 నాటికి ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరికి ఊబకాయం.. చర్యలు తప్పనిసరి అంటున్న సంస్థలు..
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

